Fake Notes : నకిలీ కరెన్సీ నోట్లను తయారుచేసి.. వాటి ద్వారా లాటరీ టికెట్లు కొంటున్న 68 ఏళ్ల విలాసినీ, 34 ఏళ్ల షీబాను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లిద్దరూ.. కొట్టాయంలోని అళప్పుళా అంబాలాపుళాకి చెందిన వారు. కొట్టాయం వెస్ట్ పోలీసులు వీళ్లను అరెస్టు చేశారు. అసలు ఈ నేరం ఎలా బయటపడిందంటే.. నకిలీ నోటు తీసుకొని ఎప్పట్లాగే.. లాటరీ టికెట్స్ కొనేందుకు విలాసినీ ఓ షాపుకి వెళ్లింది. అక్కడ షాపు యజమానికి ఆమె తీరు అనుమానం కలిగించింది. జనరల్‌గా నిజమైన డబ్బుతో ఏదైనా కొనేవారు.. ఆచితూచి వ్యవహరిస్తారు. పోతే పోనీ అన్నట్లు నిర్లక్ష్యంగా ఉండరు. కానీ ఆమె నకిలీ కరెన్సీతో కొంటోంది కదా.. కాబట్టి ఆమెకు మనీ ఖర్చవుతుందనే ఆలోచన లేదు. ఇదే షాపు ఓనర్‌కి అనుమానం కలిగించింది. సీక్రెట్‌గా పోలీసులకు కాల్ చేసి.. ఆమెను మాటల్లోకి దింపాడు. ఈలోగా అక్కడికి వచ్చిన పోలీసులు.. ఆమెను అరెస్టు చేశారు.
విలాసినీ దగ్గర ఉన్న 14 నకిలీ వంద రూపాయల నోట్లను పోలీసులు సీజ్ చేశారు. తనకేమీ సంబంధం లేదన్న విలాసినీ.. తెగ కంగారుపడుతూ.. తన కూతురే అంతా చూసుకుంటోందని చెప్పింది. దాంతో విలాసినీని వెంట పెట్టుకొని పోలీసులు.. ఆమె ఉంటున్న అద్దె ఇంటికి వెళ్లారు. కురిచీ కలాయ్పడి ఏరియాలో ఉంది ఆ ఇల్లు. తలుపు కొట్టగానే.. తలుపు తీస్తూ.. షీబా.. పోలీసుల్ని చూసి బిత్తరపోయింది. వెంటనే ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. లైట్లు వేశారు. అక్కడ వారికి అసలు విషయం అర్థమైంది. వెంటనే షీబాని కూడా అరెస్టు చేశారు.
ఆ ఇంట్లో పోలీసులు 31... 500 రూపాయల నకిలీ నోట్లను నోట్లు, 200 రూపాయల నకిలీ నోట్లు 7, వంద రూపాయల నకిలీ నోట్లు 4, పది రూపాయల నకిలీ నోట్లు 8 స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటూ.. ఓ ల్యాప్ టాప్, ప్రింటర్, స్కానర్ ని కూడా సీజ్ చేశారు.
Crime : టాలీవుడ్ సినీ నటులే టార్గెట్.. అసభ్య పోస్టులు.. వ్యక్తి అరెస్ట్
ఎలా నేర్చుకున్నారు?
ఆ తల్లీ కూతురిని చూస్తే.. అంతగా టెక్నాలజీ తెలిసిన వారిలా లేరు. కానీ నేరాన్ని పర్ఫెక్టుగా చేస్తున్నారు. ఎలా నేర్చుకున్నారని అడిగితే.. షీబా వివరాలు చెప్పింది. నకిలీ నోట్లు ఎలా తయారుచెయ్యాలో గూగుల్‌లో సెర్చ్ చేసి.. వీడియోలు చూసింది. ఆ ప్రకారమే ల్యాప్ టాప్, ప్రింటర్, స్కానర్ కొనేసిన షీబా.. నకిలీ నోట్లు ముద్రించి.. ముందుగా మార్కెట్లో వాటిని చెలామణీ చేసింది. ఆ తర్వాత తల్లికి కూడా అలవాటు చేసింది. ఇద్దరూ ఇలా వాటిని మార్పిడి చేసుకుంటున్నారు. తాజాగా వాటితో లాటరీ టికెట్లు కొంటూ దొరికపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Kerala, Telugu news