హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఖతర్నాక్ వ్లాగర్ జంట హనీట్రాప్.. యూట్యూబర్ల స్కెచ్ మామూలుగా లేదుగా..

ఖతర్నాక్ వ్లాగర్ జంట హనీట్రాప్.. యూట్యూబర్ల స్కెచ్ మామూలుగా లేదుగా..

వ్లాగర్ జంట

వ్లాగర్ జంట

Crime : నేరం చెయ్యకూడదు అని తెలిసి కూడా నేరాలు చేసేవాళ్లను ఏమనాలి? సమాజంలో ఎంతో పలుకుపడి ఉండి ఏం లాభం? హనీట్రాప్ చేసి.. అడ్డంగా దొరికారు. ఇలాంటి వాళ్లకు ఎలాంటి శిక్ష వెయ్యాలో మీరే ఆలోచించండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కేరళలోని మలప్పురంలో జరిగిన సినీమాటిక్ రియల్ క్రైమ్ స్టోరీ ఇది. 30 ఏళ్ల రషీదా, ఆమె భర్త 36 ఏళ్ల నిషాద్.. ఇద్దరూ యూట్యూబర్లు. కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తారు. వీళ్లకు సోషల్ మీడియాలో మంచి పేరే ఉంది. వ్లాగర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదంతా పైకి కనిపించేది మాత్రమే. తెరవెనక వీళ్లిద్దరూ ఖతర్నాక్‌లు. నయవంచనకు కేరాఫ్ అడ్రెస్‌లు. అందుకే పోలీసులు ఇద్దర్నీ అరెస్టు చేశారు. వీళ్లు వేసిన హనీట్రాప్ స్కెచ్.. వీళ్లను జైలుపాలు చేసింది. అడ్డదారిలో వెళ్తే.. బుక్కవడం గ్యారెంటీ అని వీళ్ల కథ తెలుపుతోంది.

ఏం జరిగింది?

త్వరగా డబ్బు సంపాదించేయాలి.. కోటీశ్వరులం అయిపోవాలి అని ఈ జంట అనుకుంది. కానీ యూట్యూబ్ అంత మనీ ఇవ్వట్లేదు. ఏం చేసినా వేలల్లో తప్ప లక్షల్లో మనీ రావట్లేదు. సరైన మార్గంలో వెళ్తే ఇలాగే ఉంటుంది అనుకున్న వీళ్లిద్దరూ.. ఓ స్కె్చ్ వేశారు. కాస్త డబ్బు ఉండి.. ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్న ఓ 68 ఏళ్ల ముసలోణ్ని ఎంచుకున్నారు. ఆ తర్వాత డ్రామా మొదలైంది. రషీదా.. ఆ ముసలాయనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ఓకే చేశాడు.

2021 జులైలో.. ముసలోడితో పరిచయం పెంచుకున్న రషీదా.. చాటింగ్ మొదలుపెట్టింది. తర్వాత నువ్వంటే ఇష్టం అంది. ఎంజాయ్ చేద్దాం అంది. ముసలాయన ఆమె ట్రాప్‌లో పడ్డాడు. ఓ రోజు అలువా లోని తన ఫ్లాట్‌కి రమ్మంది. ఇదంతా తన భర్తకు తెలుసనీ.. అతని సమ్మతి తోనే చేస్తున్నానని చెప్పింది. నిజమే అనుకున్నాడు. వెళ్లాడు. సీక్రెట్ కెమెరాలు పెట్టి.. అతనితో ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకుంది.

ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ మొదలుపెట్టారు. తమకు డబ్బు ఇవ్వకపోతే.. వీడియోని ముసలాయన కుటుంబ సభ్యులకు చూపిస్తామని బెదిరించారు. దాంతో ముసలాయన అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా సంవత్సర కాలంలో రూ.23 లక్షలు దోచేశారు.

ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తరహా హత్య.. కూతుర్ని చంపి తండ్రి పక్కా స్కెచ్...

రాన్రానూ ముసలాయన ముడుచుకుపోతుండటంతో ఇంట్లోవాళ్లకు డౌట్ వచ్చింది. మనీ ఏం చేస్తున్నారని గట్టిగా నిలదీస్తే.. నిజం చెప్పేశాడు. కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో అతని కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో కన్నింగ్ జంట కుట్రకు బ్రేక్ పడింది. నిషాద్‌ని జైలుకు పంపిన కోర్టు.. రషీదాకు బెయిల్‌ ఇచ్చింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉండటంతో ఆ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఈ కహానీ చెబుతున్నదొకటే.. అడ్డదారిలో వెళ్లేవాళ్లు ఎప్పటికైనా బుక్కై తీరుతారు.

First published:

Tags: Crime news, Kerala

ఉత్తమ కథలు