బాలికను కిడ్నాప్ చేసి.. అత్యాచారానికి యత్నించిన కేసులో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. కేరళలోని ఇడుక్కికి చెందిన జిత్ (22)ని పోలీసులు పట్టుకున్నారు. బాలిక తల్లిదండ్రులు మంగళవారం పెరుంబవూరు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో... ఆ దిశగా దర్యాప్తు చేసి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
పక్కా ప్లాన్:
జితిన్ మూడు వారాల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ బాలికకు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెట్టాడు. తన ఫొటోలకు లైక్స్ కొడుతున్నాడు కదా అని ఆమె రిక్వెస్ట్ ఓకే చేసింది. దాంతో ఆమె ఫాలోయర్ అయ్యాడు. తర్వాత ఆమెతో పరిచయం పెంచుకొని మెల్లగా మొబైల్ నంబర్ తెలుసుకొని చాటింగ్ చేశాడు.
మూడు వారాల తర్వాత మనం ఓసారి కలుద్దామా.. అని అనడంతో ఆ అమాయక బాలిక సరే అంది. బైక్‌పై పెరుంబవూరు చేరుకుని ఉదయాన్నే స్కూల్‌కి వెళ్లే బాలికను బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. ఎక్కడెక్కడో తిప్పాడు. బాలిక స్కూల్‌కి రాకపోవడంతో.. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.
బాలికను ఊరంతా తిప్పిన జితిన్.. సాయంత్రం ఊరి చివర.. శిథిలావస్థలో ఉన్న ఓ ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక ఎలాగొలా తప్పించుకొని పరుగులు పెడుతుంటే.. అటుగా వెళ్లే స్థానికులు ఆమెను చూశారు. స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న ఆమె వెనక జితిన్ పరుగెడుతుండటం చూసి.. వారికి డౌట్ వచ్చింది. వెంటనే పోలీసులకు కాల్ చేశారు.
అప్పటికే బాలిక కోసం వెతుకుతున్న ఇడుక్కి పోలీసులు వేగంగా స్పందించి.. జితిన్‌ను పట్టుకున్నారు. బైక్‌ని స్వాధీనం చేసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పెరుంబవూరు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కూరగాయల దుకాణంలో పనిచేస్తున్న జితిన్.. ఆమెను రేప్ చేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేశాడని తెలిసింది.
ఈమధ్య జితిన్ లాంటి కొండెగాళ్లు ఎక్కువవుతున్నారు. స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. పేరెంట్స్ మీ పిల్లలు జాగ్రత్త. సోషల్ మీడియాలో వారు ఎవరెవరితో చాట్ చేస్తున్నారో, ఎవరితో స్నేహాలు చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండటం మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Instagram, Kerala