హోమ్ /వార్తలు /క్రైమ్ /

Nursing Student: నర్సింగ్ చదువుతున్న యువతి.. రాత్రి వేళ స్నానాల గదిలో షాకింగ్ సీన్.. అయ్యో పాపం..

Nursing Student: నర్సింగ్ చదువుతున్న యువతి.. రాత్రి వేళ స్నానాల గదిలో షాకింగ్ సీన్.. అయ్యో పాపం..

నీనా సతీష్

నీనా సతీష్

ఆ యువతి నర్సింగ్ (Nursing student) చదువుతోంది. తల్లిదండ్రులు కూడా ఆ యువతిని చూసి మురిసిపోయారు. కానీ అంతలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

ఆ యువతి నర్సింగ్ (Nursing student) చదువుతోంది. తల్లిదండ్రులు కూడా ఆ యువతిని చూసి మురిసిపోయారు. కానీ అంతలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాలేజ్ హాస్ట‌ల్‌లో ఆ యువతి ఉరి వేసుకుని కనిపించింది. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని (Karnataka) మంగళూరులో (Mangalore) చోటుచేసకుంది. ఆ యువతిని కేరళకు (Kerala) చెందిన 19 ఏళ్ల నీనా సతీష్‌గా గుర్తించారు. వివరాలు.. నీనా సతీష్ స్వస్థలం చిట్టరిక్కల్‌లోని తంపుంకల్. ఆమె మంగళూరులోని కొలస్సా కాలేజ్‌లో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే నీనా ఫీజు చెల్లించకపోవడంతో కాలేజ్ సిబ్బంది ఆమెపై ఒత్తిడి తెచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ విషయం తన స్నేహితులకు చెప్పిన నీనా.. తీవ్ర మనస్తాపానికి గురైంది.

మరోవైపు ఫీజులు చెల్లించడం ఆలస్యమైనందుకు ఆమెను కాలేజ్ సిబ్బంది మానసిక వేదనకు గురిచేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా కాలేజ్ సిబ్బంది.. విద్యార్థులకు రోజుకి అర గంట మాత్రమే ఫోన్ వినియోగించడానికి అనుమతిస్తారని, తల్లితో మాట్లాడలేకపోవడం వల్ల నీనా.. తీవ్ర మనస్తాపం చెందిందని ఆమె తోటి విద్యార్థినులు చెప్పారు. ఈ క్రమంలోనే ఆమె నిన్న రాత్రి హాస్టల్‌‌లోని స్నానాల గదిలో ఆమె ఉరివేసుకుని కనిపించింది.

అమ్మ, నాన్న.. మా ఇంటికి రండి అని ఫోన్ చేసిన యువతి.. ఆ తర్వాత 15 నిమిషాలకే అల్లుడు ఫోన్ చేసి..


ఇది గమనించిన అక్కడివారు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. మంగళూరులోని సిటీ ఆస్పత్రిలో (City Hospital) ఆమెను చేర్పించారు. అయితే అక్కడ ఐసీయూ చికిత్స పొందుతున్న నీనా.. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం మరణించింది. ఈ ఘటనతో నీనా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరోవైపు ఈ ఘటనతో కాలేజ్‌లో చదువుతున్న మిగతా విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా టెన్షన్ నెలకొంది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న మంగళూరు పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

Married Woman: పెళ్లి జరిగిన 10 రోజులకు యువతికి ఊహించని షాక్.. అత్తకు ఆ విషయం చెబితే..


ఇక, నీనా కుటుంబం గతంలో కన్నూరులో నివాసం ఉండేది. అయితే ఇటీవల వారు కాసర్‌గోడ్ చిట్టరిక్కల్కు మారారు.

First published:

Tags: Crime news, Kerala

ఉత్తమ కథలు