Home /News /crime /

అనుమానం రాకుండా దందా.. ముఠాలో యువతులు కూడా.. ఇంతకీ వీరు ఏం చేస్తున్నారంటే..

అనుమానం రాకుండా దందా.. ముఠాలో యువతులు కూడా.. ఇంతకీ వీరు ఏం చేస్తున్నారంటే..

డ్రగ్స్ ముఠా సభ్యులు

డ్రగ్స్ ముఠా సభ్యులు

వాళ్లందరూ హాస్టల్స్‌లో లేదా పేయింగ్ గెస్ట్‌లుగా ఉంటారు.. ఇలా ఎవరికీ అనుమానం రాకుండా దందాను కొనసాగిస్తారు. ఇంతకీ వాళ్లు చేసే దందా ఏమిటో తెలుసా..?

    వాళ్లందరూ హాస్టల్స్‌లో లేదా పేయింగ్ గెస్ట్‌లుగా ఉంటారు.. ఇలా ఎవరికీ అనుమానం రాకుండా దందాను కొనసాగిస్తారు. ఇంతకీ వాళ్లు చేసే దందా ఏమిటో తెలుసా.. డ్రగ్స్ స్మగ్లింగ్. కేరళలోని కొచ్చిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకన్న పోలీసులు.. వాటితో సంబంధం ఉన్న పలువురిని అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠాలో అనేక మంది యువతులు ఉన్నట్టుగా గుర్తించారు. చాలా మంది యువతులు డ్రగ్స్‌కు బానిసగా మారిన వారేనని.. వీరు డబ్బు, డ్రగ్స్ కోసం ముఠాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని పోలీసులు కనుగొన్నారు. కరోనా లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి.. నగరంలో జీవించడానికి ఇబ్బంది పడుతున్న కొందరు ఈ డ్రగ్స్ ముఠాలో చేరారని పోలీసులు తెలిపారు.

    ఇక, అంతరాష్ట్ర డ్రగ్స్ రాకెట్‌లో కూడా ఈ ముఠా ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కొచ్చిలో ఉంటున్న ఈ ముఠాకు బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాలలో ఉన్న డ్రగ్ మాఫియాలతో సంబంధాలు ఉన్నాయి. చాలామంది యువతులు హాస్టల్స్‌లో, పేయింగ్ గెస్ట్‌లుగా నగరంలో ఎవరికీ అనుమానం రాకుండా ఉంటారు. డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేటప్పుడు అమ్మాయిలను గ్యాంగ్‌లో చేర్చుకోవడం ద్వారా పోలీసులకు అనుమానం రాకుండా ఉంటుందని ముఠా సభ్యులు భావించారు.

    ఇక, కేరళలో ఎక్సైజ్ అధికారులు ఒక్క రోజులోనే దాదాపు రెండు కిలో సింథటిక్ డ్రగ్స్(రసాయనాలతో కూడిన డ్రగ్స్)‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 10 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చెన్నై, కొచ్చిలలోని కొందరు గుండాలు వీరికి సన్నిహితంగా ఉంటున్నారు. వారు ఎస్కార్ట్‌గా ఉండి సరకు రవాణా చేస్తున్నారు. ఈ ముఠాకు సహకరించిన వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకన్నవారిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

    చెన్నై నుంచి లగ్జరీ కార్లలో వీరు MDMAను తరలిస్తున్నారు. ఇందుకోసం యువతులను తమతో పాటు ఉంచుకోవడం ద్వారా చెక్ పోస్ట్‌ల వద్ద ఫ్యామిలీ అని నమ్మిస్తున్నారు. అలాగే వీరితో పాటు విదేశీ జాతుల కుక్కలు కూడా ఉన్నాయి. పలుచోట్ల ఫ్లాట్లను అద్దెకు తీసుకుని వీరు ఈ దందా సాగిస్తున్నారు. అయితే పోలీసులు తనిఖీలు చేసిన మూడు విదేశీ జాతులకు చెందిన కుక్కలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Drugs, Kerala

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు