ఆమెకు 23 ఏళ్లు.. అతడికి 15 ఏళ్లు.. ఒంటరిగా వెళ్తున్న ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లాడు.. చివరకు ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Crime News: 23 ఏళ్ల యువతిని వెంటాడి పొలాల్లోకి ఈడ్చుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ ప్రతిఘటించడంతో రాయితో దాడి చేశాడు. తర్వాత ఏమైందంటే..

 • Share this:
  23 ఏళ్ల యువతిని (Young Women) వెంటాడి పొలాల్లోకి ఈడ్చుకెళ్లి అత్యాచారం(Rape) చేసేందుకు ప్రయత్నించిన 15 ఏళ్ల బాలుడిని పోలీసులు(Police) అదుపులోకి తీసుకున్నారు. మహిళ ప్రతిఘటించడంతో రాయితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన కేరళ(Kerala)లోని కొండొట్టి ప్రాంతంలో చోటు చేసుకుంది. అర్థరాత్రి ఆ మహిళ తన ఇంటి నుంచి కొట్టుక్కర జంక్షన్ వైపు వెళ్తోంది. ఆమె తాను చదువుకుంటున్న కొండొట్టిలోని కంప్యూటర్ సెంటర్‌కు వెళ్లేందుకు నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ బాలుడు ఆమెను వెంబడించి వెనుక నుంచి పట్టుకుని సమీప పొలంలోకి బలవంతంగా లాక్కెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.

  Crime News: ఈ మహిళ పోరాడి అనుకున్నది సాధించింది.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..


  ఆమె అడ్డుకోవడంతో ఆమె ముఖంపై రాయితో కొట్టాడు. అయితే, ఆ మహిళ అతని చెర నుంచి ఎలాగోలా తప్పించుకొని అక్కడ నుంచి పారిపోయింది. అటు నుంచి వాళ్ల ఇంటికి చేరుకుంది. అక్కడ తన కుటుంబసభ్యులతో జరిగిన విషయం అంతా చెప్పింది. దీంతో వాళ్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుడు 10వ తరగతి విద్యార్థి , రాష్ట్ర స్థాయి జూడో ఛాంపియన్ అని పోలీసుల విచారణలో తేలింది.

  ఇదిలా ఉండగా ఈ ఘటనలో అమ్మాయి ముఖంపై ఆ బాలుడు దాడి చేయడంతో ఆమె ముఖం మొత్తం వాచిపోయింది. సదరు యువతి దుస్తులు కూడా చినిగిపోయాయి. దాడి చేసిన వ్యక్తే ఆమె దుస్తులను చింపేశాడు. ఆమెను ప్రథమ చికిత్స నిమిత్తం కొండోట్టి తాలూకా ఆసుపత్రికి తరలించామని అక్కడ నుంచి మెరుగైన చికిత్స కొరకు మంజేరి మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించినట్లు కొట్టుక్కర వార్డు కౌన్సిలర్ ఉమ్మర్ ఫరూక్ తెలియజేశాడు.

  ఓ ఆటోలో ముగ్గురు తాగుబోతులు.. నిర్మాణుష్య ప్రాంతం.. కల్లు తాగిన వివాహిత.. చివరకు ఏం జరిగిందంటే..


  ఆమె నిత్యం కంప్యూటర్ క్లాస్ లకు వెళ్లేదని.. కంప్యూటర్ సెంటర్ ఆమె ఉంటున్న ప్రదేశానికి ఒక కిలో మీటర్ దూరంలో ఉండేది. ఆమె అక్కడ నుంచి వెళ్లాలంటే.. షార్ట్ కట్ రూట్లో వరి పొలం నుంచి వెళ్లేది. అది గమనించి నిందితుడు ఇలా ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. దీనిపై మలప్పురం జిల్లా పోలీసు చీఫ్ సుజిత్ దాస్ మాట్లాడుతూ.. అత్యాచారం చేయడానికి ప్రయత్నించినప్పుడు బాలుడి చేతి, మెడ మరియు పెదవులపై మహిళకు సంబంధించిన గోళ్ల గుర్తులు ఉన్నాయని తెలిపారు.

  Shocking Incident: ఆ మహిళ ఆటో కోసం ఎదురు చూస్తోంది.. గమనించిన ముగ్గురు తాగుబోతులు ఆమెను.. బలవంతంగా..


  ఆమె ప్రతి ఘటించే ప్రయత్నంలో ఈ గాయాలు అయ్యాయన్నారు. మహిళ అందించిన వివరణలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతడిని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అతడిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరచనున్నారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసేందుకు బాలుడు ప్రయత్నించాడని పోలీసులకు నివేదిక అందజేస్తామని కొండొట్టి ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ ఎంసీ తెలిపారు.
  Published by:Veera Babu
  First published: