అసలే లాక్డౌన్.. ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు.. ఓ యువకుడు కూడా వేరే ఊరిలో చిక్కుకుపోయాడు.. ఆ ఊరిలో ఫ్రెండ్ ఉంటున్నాడని తెలిసి అతడి ఆశ్రయం కోరాడు. తెలిసినోడే.. పైగా చిన్నప్పటి దోస్త్ అని.. అతడు కూడా ఇంటికి పిలిచి ఆశ్రయమిచ్చాడు. అదే పెద్ద తప్పైంది. తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లు.. ఆశ్రయం ఇచ్చిన ఫ్రెండ్ భార్యనే లేపుకెళ్లిపోయాడు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఇడుక్కీ జిల్లా మున్నార్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల లోథారియో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. లాక్డౌన్ వల్ల అతడు మువత్తుపుజ పట్టణంలో చిక్కుకుపోయాడు. అదే పట్టణంలో చిన్నప్పటి ఫ్రెండ్ కుటుంబంతో ఉంటున్నాడు. అతడు ప్రేమించి పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలతో హాయిగా ఉంటున్నాడు. లోథారియో అతడికి ఫోన్ చేయగా ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయమిచ్చి భోజనం పెట్టాడు. అయితే, ఫ్రెండ్ భార్యను లేపుకెళ్లిపోయాడు లోథారియో. ఇంట్లోని బంగారు ఆభరణాలు తీసుకొని కారులో పరారయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న బాధితుడు.. పోలీసులను ఆశ్రయించడంతో వివాహితను పట్టుకొని వచ్చారు. తన భర్త స్నేహితుడితోనే తాను ఉంటానని భార్య చెప్పడంతో భర్తతో పాటు పోలీసులు కూడా షాక్కు గురయ్యారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో భర్తతో కలిసి ఉండేందుకు అంగీకరించింది.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.