• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • KERALA IDUKKI NATIVE DHANYA DIED IN HUSBAND HOUSE HUSBAND AMAL ARRESTED SU

తల్లిదండ్రులకు ఫోన్ చేసిన మహిళ.. తెల్లారేసరికి ఘోరం.. ఇలా జరుగుతందని వాళ్లు ఊహించలేకపోయారు..

ధన్య, అమల్ పెళ్లి ఫొటో

అమల్ బాబుకు, జయప్రకాశ్ కూతరు ధన్యకు 2019 నవంబర్ 9న వివాహం జరిగింది. పెళ్లి సమయానికి ధన్య.. MES College‌లో బీఎస్సీ మ్యాథ్స్ ఫైనల్ ఈయర్ చదువుతోంది.

  • Share this:
    ఓ మహిళ తన భర్త ఇంట్లో చనిపోయి కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత మహిళను 21 ఏళ్ల ధన్యగా గుర్తించారు. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలోని మట్టుకట్టలో చోటుచేసుకుంది. అమల్ బాబుకు, జయప్రకాశ్ కూతరు ధన్యకు 2019 నవంబర్ 9న వివాహం జరిగింది. పెళ్లి సమయానికి ధన్య.. MES College‌లో బీఎస్సీ మ్యాథ్స్ ఫైనల్ ఈయర్ చదువుతోంది. 2 లక్షల కట్నంతో పాటు బంగారు ఆభరణాలు కూడా అమల్‌కు ఇచ్చారు. ప్రస్తుతం ఈ దంపతులకు 8 నెలల చిన్నారి కూడా ఉంది. అయితే ధన్య.. కొద్ది రోజుల క్రితం ఇంట్లో మృతిచెంది కనిపించింది. ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిగా ఉన్న అమల్.. ఉదయం ఆఫీసుకు వెళ్ళిన తరువాత ఈ సంఘటన జరిగింది.

    అయితే పెళ్లి జరిగిన తర్వాత అమల్ తనను వేధిస్తున్నాడని ధన్య తన తల్లిదండ్రులకు చెప్పింది. ధన్యను అమల్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు వేధించారని ఆమె తండ్రి జయప్రకాశ్ చెప్పారు. చనిపోవడానికి ఒక రోజు ముందు ఫోన్ చేసిన ధన్య.. అమల్ తనను కొట్టినట్టు చెప్పిందని అన్నారు. దీంతో ధన్యను ఇంటికి తీసుకొచ్చేందుకు మరుసటి రోజు వెళ్దామని అనుకున్న సమయంలో ఈ ఘోరం జరిగిందని అన్నారు.

    ధన్య మృతిపై ఆమె తండ్రి జయప్రకాశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురి మృతికి అల్లుడు అమల్‌పై అనుమానం ఉందని ఆయన పోలీసులకు చెప్పాడు. తన కూతురు ఉరివేసుకున్నట్టుగా చెప్పబడుతున్న విండో.. పెద్దగా ఎత్తులో లేదని అన్నారు. ఇక, ఈ కేసును విచారించిన పోలీసులు.. ధన్య మానసికంగా, శారీరకంగా వేధింపులు ఎదుర్కొన్నట్టుగా గుర్తించారు. ఆత్మహత్యకు ప్రేరేపించడానే చార్జెస్‌పై అమల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్ విధించింది.

    ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్టుగా పోలీసులు చెప్పారు. అమల్ తల్లిదండ్రుల ప్రమేయం ఉందా? అనే కోణంలో కూడా విచారణ సాగుతుందని తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: