Kerala Gold Smuggling | కేరళ సీఎంఓను షేక్ చేస్తున్న బంగారం స్మగ్లింగ్

యూఏఈ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కేరళ సీఎంఓను షేక్ చేస్తోంది.

news18-telugu
Updated: July 8, 2020, 4:12 PM IST
Kerala Gold Smuggling | కేరళ సీఎంఓను షేక్ చేస్తున్న బంగారం స్మగ్లింగ్
స్వప్న సురేష్, సీఎం పినరయి విజయన్
  • Share this:
యూఏఈ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కేరళ సీఎంఓను షేక్ చేస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ కేసులో సీఎం ఆఫీసు మీద ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బంగారం స్మగ్లింగ్ చేసే వారిని ముఖ్యమంత్రి కార్యాలయం రక్షించాలని చూస్తోందంటూ మండిపడ్డాయి.

సుమారు రూ.15 కోట్ల విలువైన 30 కేజీల బంగారం యూఏఈ నుంచి కేరళలోని రాయబార కార్యాలయం పేరుతో వచ్చింది. జూలై 4న వచ్చిన ఆ ప్యాకేజీని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ స్మగ్లింగ్‌లో స్వప్న సురేష్ అనే మహిళ ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఆమె యూఏఈ క్యాన్సులేట్‌లో గతంలో పనిచేశారు. అలాగే, కేరళ ప్రభుత్వ ఐటీ శాఖకు అనుబంధంగా ఉన్న సాఫ్ట్ వేర్ కంపెనీకి మార్కెటింగ్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు.

యూఏఈ కాన్యులేట్ పేరుతో బంగారం స్మగ్లింగ్ జరగడంపై ఆ దేశం స్పందించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, దోషులను వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది. స్మగ్లింగ్ పేరుతో రాయబార కార్యాలయం పేరు చెడగొడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో భారత విచారణాధికారులకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేసింది.

ఈ కేసులో పినరయి విజయన్ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు అయిన స్వప్న సురేష్‌ను కేరళ ప్రభుత్వం కావాలని నియమించిందని, ఆమెను నియమించవద్దని ఇంటెలిజెన్స్ నివేదికలు ఇచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. సీఎంఓ ఆఫీసుల ఆమె చక్రం తిప్పగలదని ఆరోపించారు. అయితే, ప్రభుత్వం ఏ విచారణకైనా సిద్ధంగా ఉందని సీఎం పినరయి విజయన్ ప్రకటించారు.

మరోవైపు ఈ కేసును బయటపెట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ కూడా సీఎంఓ మీద అనుమానం వ్యక్తం చేశారు. స్వప్న సురేష్‌ను బయటపడేసేందుకు సీఎంఓ ఆఫీసు నుంచి కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఆమె మీద గతంలో కేసులు ఉన్నా కూడా ఎందుకు పెద్ద పొజిషన్ ఇచ్చి కూర్చోబెట్టారని ప్రశ్నించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 8, 2020, 4:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading