మూగ జీవులపై ఎక్కడో ఓ చోట దారుణాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఓ కుక్కను స్కూటర్ వెనకాల కట్టేసి రోడ్డుపై ఇడ్చుకుని వెళ్లారు. ఈ ఘటన కేరళ మల్లాప్పురం జిల్లా ఎడక్కరలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు తమిళనాడుకు చెందిన జేవీయర్ ఎడక్కరలో నివాసం ఉంటున్నారు. అయితే అతడు కుక్క పట్ల కర్కషంగా ప్రవర్తించాడు. మరో వ్యక్తితో కలిసి కుక్కను స్కూటర్ వెనక భాగంలో కట్టేశాడు. అనంతరం రోడ్డుపై లాక్కుంటూ వెళ్లాడు. ఈ షాకింగ్ ఘటనను చూసిన స్థానికులు.. ఆ స్కూటర్‌ను అడ్డుకుని కుక్కను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు జేవీయర్‌పై కేసు నమోదు చేశారు.
ఇక, కుక్క కాలుకు గాయాలు అయ్యాయి. దీంతో కుక్కను ఎమర్జెన్సీ రెస్క్యూ ఫోర్స్ ఆధ్వర్యంలో ఉంచారు. ఇక, ఆ కుక్కను దాదాపు మూడు కిలోమీటర్ల దూరం లాక్కుని వెళ్లినట్టుగా స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ కుక్క ఎక్కడి నుంచో వచ్చిందని.. ఇంట్లో ఉన్న అన్ని చెప్పులను, షూలను కొరికివేసిందని చెప్పుకొచ్చాడు. దీంతో కుక్కను దూరంగా పంపడానికి స్కూటర్‌కు కట్టి లాక్కెళ్లినట్టు తెలిపాడు.
Buxar Railway Station: షాకింగ్ వీడియో.. రైల్వే స్టేషన్ నుంచి పరుగులు తీసిన ప్రయాణికులు.. కారణమిదే..
Indian Railways: రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త.. ఇలా చేస్తే మీ జేబుకు చిల్లే..
ఈ ఘటనకు సంబంధించి జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగ జీవి అయిన కుక్క పట్ల ఈ విధంగా విచక్షణ రహితంగా ప్రవర్తించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Dog, Kerala