Choose Municipal Ward
  CLICK HERE FOR DETAILED RESULTS

  సోషల్ మీడియాలో వేధింపులు.. యువ డాక్టర్ ఆత్మహత్య

  తమ వ్యూస్, రేటింగ్స్ ను పెంచుకోవడానికి నెట్టింట పలువురు చేస్తున్న పనులతో వందలాది మంది.. మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

  news18
  Updated: October 3, 2020, 1:10 PM IST
  సోషల్ మీడియాలో వేధింపులు.. యువ డాక్టర్ ఆత్మహత్య
  ఫైల్ ఫోటో
  • News18
  • Last Updated: October 3, 2020, 1:10 PM IST
  • Share this:
  ప్రపంచంతో నిత్యం కమ్యూనికేట్ అవడానికి, ఆధునిక జీవితంలో దగ్గరివాళ్లతో ఎప్పటికప్పుడూ కలుసుకోవడానికి, సమాజంలో మంచి పనులు చేయడానికి వినియోగించాల్సిన సోషల్ మీడియా.. మంచి కంటే చెడునే ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నది. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న వేధింపులు తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో కేరళలో ఇటీవలే ఒక వైద్యుడు కూడా సామాజిక మాధ్యమాలలో నెటిజన్ల నుంచి వస్తున్న వేధింపులు భరించలేక తనువు చాలించాడు. బాత్ రూం గోడలపై ‘సారీ’ అని రాసి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కేరళ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నది. ఇంతకీ అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? లేక మరేదైనా కారణముందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  ఏం జరిగిందంటే..

  కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన అనూప్ కృష్ణ (35) అనే యువడాక్టర్ ఆర్థోపెడిక్ గా పనిచేస్తున్నాడు. అతడికి సొంతంగా క్లినిక్ కూడా ఉంది. గతనెల 23న అతడి దగ్గరికి మోకాలి శస్ర్త చికిత్స నిమిత్తం ఒక ఏడేళ్ల పాపను తీసుకొచ్చారు. అయితే అతడు ఆ పాపకు సర్జరీ చేశాడు. ఆపరేషన్ చేస్తున్న క్రమంలో.. చిన్నారికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను మరో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో.. ఆ చిన్నారి మరణించింది. దీంతో ఆ చిన్నారి కుటుంబసభ్యలు పసిపాప మృతికి అనూపే కారణమని ఆందోళనకు దిగారు. ఆయన హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. తమ కూతురు మృతికి అనూప్ దే బాధ్యత అని వాల్లు ఆరోపిస్తున్నారు. అనూప్ పై పోలీసు కేసు కూడా నమోదైంది.

  ఇదిలాఉండగా.. ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి సోషల్ మీడియాకు ఎక్కింది. ఇంకేం.. రేటింగుల కోసం వేచి చూస్తున్న పలు యూట్యూబ్ ఛానెళ్లు, వ్యక్తులు.. తమ కు కావలసినది యాడ్ చేసుకుని వీడియోలు విడుదల చేశారు. ఇవి కాస్తా వైరలయ్యాయి. దీంతో అనూప్ కు సామాజిక మాధ్యమాలలో వేధింపులు ఎక్కువయ్యాయి.

  క్షమించండి...

  వేధింపులు పెరగడంతో అనూప్ తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఈనెల 1న తన హాస్పిటల్ లోని బాత్ రూంలో విగతజీవిగా పడి ఉన్నాడు. బాత్ రూం గోడలపై ‘సారీ’ అని రాసి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనూప్ సోషల్ మీడియా వేధింపుల వల్లే చనిపోయాడా..? లేక మరేదైనా కారణముందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

  అనూప్ కు మద్దతిస్తున్న డాక్టర్లు..

  అనూప్ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో.. కేరళ వైద్యులు ఆయన పక్షానే నిలిచారు. నిజానికి ఈ కోవిడ్ కాలంలో ఆ చిన్నారికి వైద్యం చేయడానికి ముందుకొచ్చినందుకు ఆయనను అభినందించాలని అంటున్నారు. చాలా మంది ఆమెకు వైద్యం చేయడానికి నిరాకరించినా.. అనూప్ మాత్రం చేశాడని అంటున్నారు. అనుకోని పరిస్థితుల్లో చిన్నారి మరణించిందనీ, దానికి అనూప్ ను బాధ్యుడిగా చేయడం సరికాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సుల్ఫీ నుహూ అన్నారు. ప్రతి సర్జరీకి కొన్ని సమస్యలుంటాయనీ, ముఖ్యంగా రోగులకు ఆపరేషన్ చేసేప్పుడ అనస్థీషియా ఇచ్చే సర్జరీలలో సంక్లిష్టితలు తలెత్తుతాయని తెలిపారు. ఇవి రాకుండా జాగ్రత్తపడతామని, కానీ కొన్ని సార్లు దురదృష్టవశాత్తూ ఇటువంటివి జరుగుతాయని వివరించారు. జరిగిన విషయాలు తెలుసుకోకుండా ఎవరికి వారు తీర్పులివ్వడం సరికాదన్నారు. ఏదేమైనా కేరళ గొప్ప వైద్యుడిని కోల్పోయిందని నుహూ ఆవేదన వ్యక్తం చేశారు.
  Published by: Srinivas Munigala
  First published: October 3, 2020, 12:59 PM IST
  మరిన్ని చదవండి
  తదుపరి వార్తలు

  Top Stories

  corona virus btn
  corona virus btn
  Loading