చేపల కూర విషయంలో వాగ్వాదం.. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు..

ప్రతీకాత్మక చిత్రం

చేపల కూర విషయంలో విషయంలో చోటుచేసుకున్న గొడవ ఊహించని పరిణామాలకు దారితీసింది.

 • Share this:
  చేపల కూర విషయంలో విషయంలో చోటుచేసుకున్న గొడవ ఊహించని పరిణామాలకు దారితీసింది. మద్యం మత్తులో ఉన్న యువకుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ.. చివరకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన అతని ప్రాణాలను బలిగొంది. హోటల్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే సమయంలో ఈ విధంగా జరిగింది. ఈ దారుణ ఘటన జూన్ 18వ తేదీన కేరళలోని పాలక్కడ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కాసాబ్ పోలీస్ స్టేషన్‌కు అనుసంధానించబడిన ఓ పోలీసు అధికారి వెల్లడించారు. అయితే తన పేరు విషయంలో ఆయన గోప్యత పాటించారు.

  ‘గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో ఐదుగురు మద్యం మత్తులో హోటల్ వద్దకు చేరుకున్నారు. వాళ్లు హోటల్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడానికి సిద్దమ్యారు. ఆ సమయంలో వారి మధ్య గొడవ మొదలైంది. చేపల కూర విషయమై వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే 25 ఏళ్ల శ్రీజిత్.. తన చేతిలో హోటల్‌లోని ఓ గ్లాస్ మీద బలంగా కొట్టాడు. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావం జరిగింది. కొద్దిసేపటికే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అతన్ని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అతన్ని మరోక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అధిక రక్తస్రావం కావడం వల్ల అతడు ప్రాణాలు కోల్పోయాడు’అని ఆ పోలీసు అధికారి తెలిపారు.

  ఇవి చదవండి: Hyderabad: పిల్లలు పుట్టడం లేదనే అక్కసు.. భార్యభర్తలు కలిసి ఎంత దారుణానికి పాల్పడ్డారంటే..

  Hyderabad: వెంటనే ఇంటికి రండి.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అసలేం జరిగిందంటే

  ఇక, కేరళలో లాక్‌డౌన్ నిబంధనలు అనుసరించి దాదాపు 50 రోజుల మద్యం రిటైల్ అమ్మకాలు మూసివేయబడ్డాయి. అయితే లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో గురువారం నుంచి మద్యం రిటైల్ అమ్మకాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
  Published by:Sumanth Kanukula
  First published: