కథువాలో అసలేం జరిగింది? ఆ చిన్నారిని అంత దారుణంగా ఎందుకు చంపారు?

Kathua Rape Case Verdict: తమ చిన్నారి ఏమైందోనని భయపడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం..వారం తర్వాత చిన్నారని డెడ్‌బాడీ దొరకడంతో నిందితులు అప్రమత్తమయ్యారు. ఈ ఘోరాన్ని కప్పిపుచ్చేందుకు స్థానిక పోలీసులకు పెద్ద మొత్తంలో డబ్బు ముట్టచెప్పాడు.

news18-telugu
Updated: June 10, 2019, 5:24 PM IST
కథువాలో అసలేం జరిగింది? ఆ చిన్నారిని అంత దారుణంగా ఎందుకు చంపారు?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Kathua Rape Case Verdict: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా గ్యాంగ్ రేప్-మర్డర్ కేసుపై ఇవాళ స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. జూన్ 3న కేసు విచారణ పూర్తికావడంతో సోమవారం తీర్పువెల్లడించి పఠాన్‌కోట్ కోర్టు. ఏడుగురు నిందితుల్లో ఆరుగురుని దోషులుగా పేర్కొంటూ కోర్టు తీర్పు వెలువరించింది. వీరిలో ప్రధాన నిందితుడు సాంజిరామ్‌తో పాటు ముగ్గురు పోలీసులు, గ్రామ పెద్దలు కూడా ఉన్నారు. ఇక సాంజిరామ్ కుమారుడిని నిర్దోషిగా వదిలిపెట్టింది. వారందరినీ ఉరితీయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.

గత ఏడాది జనవరిలో జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లా రసానా గ్రామానికి చెందిన 8 ఏళ్ల చిన్నారిని అతి దారుణంగా హత్యచేశారు. ఐతే కథువాలో అసలేం జరిగింది? చిన్నారిని అత్యంత పాశవికంగా ఎందుకు హత్యచేశారు?


2018 జనవరి 10న ఈ చిన్నారి గుర్రాలను మేపడానికి వెళ్లి అదృశ్యమైంది. దాంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె కోసం గాలిస్తుండగా సరిగ్గా వారం రోజుల తర్వాత గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో బాలిక మ‌ృతదేహం లభ్యమైంది. ఆ చిన్నారిపై సామూహిక అత్యాచారం జరిగిందని..అనంతరం బండరాయితో తలపై మోది చంపేశారని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.

భూవివాదమే ఈ చిన్నారికి హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. రాసానా గ్రామంలో బక్రవాల్ అనే సంచార తెగ వారు ఉంటారు. వారి రవాణాకు వినియోగించే గుర్రాలను గ్రామ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి మేపుతుంటారు. ఐతే తమ పొలాల్లో అనుమతి లేకుండా గుర్రాలను మేపుతున్నారని కొందరు గ్రామస్థులు వారితో గొడవపెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాలకు గొడవలు తలెత్తాయి. దాంతో బక్రవాల్ తెగపై కక్ష పెంచుకున్న ఆలయ పూజారి సాంజీరామ్..ఏలాగైనా వారిని గ్రామం నుంచి తరిమేయాలని పథకం రచించాడు. దాన్ని పక్కాగా అమలు చేశారు.గత ఏడాది జనవరి 10న గుర్రాలను మేపేందుకు గ్రామ సమీపంలోని పొలాలకు వెళ్లింది చిన్నారి. విషయం తెలిసి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అక్కడికి వెళ్లారు. బాలికను ఎత్తుకెళ్లి సమీపంలోని ఓ దేవాలయంలో బంధించారు. గుళ్లో ఆ చిన్నారికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత మరొకరుగా పసిపాపపై తమ పశవాంఛను తీర్చుకున్నారు. అనంతరం రాయితో చిన్నారిని కొట్టి చంపి అడవిలో విసిరేశారు. తమ చిన్నారి ఏమైందోనని భయపడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం..వారం తర్వాత చిన్నారి డెడ్‌బాడీ దొరకడంతో నిందితులు అప్రమత్తమయ్యారు. ఈ ఘోరాన్ని కప్పిపుచ్చేందుకు స్థానిక పోలీసులకు పెద్ద మొత్తంలో డబ్బు ముట్టచెప్పాడు.

బాలిక మృతదేహం లభ్యమైన తర్వాత ఈ కేసును ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకొని దర్యాప్తుచేయడంతో అందరి బాగోతాలు బయటపడ్డాయి. ఆలయ పూజారి సాంజీరామ్‌తో పాటు అతడి 22 ఏళ్ల కుమారుడు, పోలీస్ అధికారులుతో పాటు మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చింది. మొదట ఈ కేసును క్రైమ్‌ బ్రాంచ్‌కు అప్పగించారు. అక్కడ పరిస్థితులు దర్యాప్తునకు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టు పఠాన్‌కోట్‌ కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసులో సోమవారం తీర్పు వెల్లడించిన కోర్టు ఆరుగురిని దోషులుగా పేర్కొంటూ తీర్పు వెల్లడించింది. సాంజిరామ్ కుమారుడిని నిర్దోషిగా ప్రకటించింది. ఐతే అతడు కూడా దోషేనని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
First published: June 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు