Kathua Rape Case Verdict: కథువా రేప్ కేసు నిందితుల్లో ఆరుగురు దోషులే... కోర్టు తీర్పు

Kathua Rape Case Verdict: బాలికకు మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. బాలికను దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: June 10, 2019, 12:54 PM IST
Kathua Rape Case Verdict: కథువా రేప్ కేసు నిందితుల్లో ఆరుగురు దోషులే... కోర్టు తీర్పు
ప్రతీకాత్మక చిత్రం
Sulthana Begum Shaik | news18-telugu
Updated: June 10, 2019, 12:54 PM IST
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా జిల్లాలోని ఎనిమిదేళ్ల బాలిక హత్యచార ఘటనపై ఇవాళ స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. జూన్ 3తో ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తయ్యింది. దీంతో 10 వ తేదీన అంటే ఇవాళ న్యాయస్థానం తీర్పు ప్రకటించింది. ఎనిమిదిమంది నిందితుల్లో ఆరుగురుని దోషులుగా పేర్కొంటూ కోర్టు తీర్పు వెలువరించింది. వీరిలో ముగ్గురు పోలీసులు.. గ్రామ పెద్ద కూడా ఉన్నారు. దీంతో బాధిత కుటుంబం దోషులకు కఠిన శిక్ష విధించాలని కోరుకుటుంది. తమ చిన్నారిని అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి హతమార్చిన క్రూరమృగాలకు ఉరిశిక్షే వేయాలని డిమాండ్ చేస్తోంది.

జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే హత్యాచారం చేశారు. బాలికకు మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. బాలికను దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఇదే క్రమంలో బాలిక ఆచూకీ కోసం ఓరోజు ఆమె తల్లిదండ్రులు ఆలయం గేటు వద్దకు రాగా.. వారిని లోపలికి రానివ్వలేదని పోలీసులు తెలిపారు. అక్కడి వాతావరణం అత్యంత చల్లగా ఉండటంతో బాలిక మృతదేహం మూడు రోజుల పాటు కుళ్లిపోకుండా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక రెవెన్యూ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ సాంజీ రామ్ ప్రధాన సూత్రధారి అని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.22ఏళ్ల కొడుకు కూడా నిందితుడేనని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.






First published: June 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...