Kathua Rape Case Verdict: ముగ్గురికి జీవిత ఖైదు.. మరో ముగ్గురు పోలీసులకు..

Kathua Rape Case Verdict: ఆరుగురు దోషుల్లో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పు వెల్లడించింది. మరో ముగ్గురు పోలీసులకు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా విధించింది.

news18-telugu
Updated: June 10, 2019, 5:13 PM IST
Kathua Rape Case Verdict: ముగ్గురికి జీవిత ఖైదు.. మరో ముగ్గురు పోలీసులకు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కథువా రేప్ కేసులో దోషులకు పఠాన్‌కోట్ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. ఆరుగురు దోషుల్లో ఆలయ పూజారి సాంఝీరామ్, అతడి మేనల్లుడు పర్వేష్ కుమార్‌, దీపక్ ఖజూరియాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇక హంతకులకు సహకరించి.. సాక్షాలను తారుమారు చేసిన ముగ్గురు పోలీసులు ఆనంద్ దత్త, తిలక్ రాజ్, సురేంద్ర వర్మకు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా విధించింది. ఐతే పఠాన్‌కోట్ కోర్టు ఖరారుచేసిన శిక్షలపై బాధిత కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. తమ చిన్నారిని పాశవికంగా హత్యచేసిన కిరాతకులను నడిరోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్‌కు వెళ్లాలని యోచిస్తున్నారు.

కథువా కేసులో జూన్ 3న కేసు విచారణ పూర్తికావడంతో పఠాన్‌కోఠ్ సోమవారం తీర్పు వెల్లడించించింది. ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా పేర్కొంటూ తీర్పు వెలువరించింది. వీరిలో ప్రధాన నిందితుడు సాంజిరామ్‌తో పాటు ముగ్గురు పోలీసులు, గ్రామ పెద్దలు కూడా ఉన్నారు. ఇక సాంజిరామ్ కుమారుడు విశాల్ జంగోత్రాని నిర్దోషిగా వదిలిపెట్టింది.

ఇది కూడా చదవండి:

కథువాలో అసలేం జరిగింది? ఆ చిన్నారిని అంత దారుణంగా ఎందుకు చంపారు?
First published: June 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading