Karvy Case: కార్వీ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. పూర్తి వివరాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

Karvy Stock money laundering case: బ్యాంకుల నుంచి రూ.వందల కోట్లు రుణం తీసుకుని ఎగవేసిన కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థపై ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే.

 • Share this:
  బ్యాంకుల నుంచి రూ.వందల కోట్లు రుణం తీసుకుని ఎగవేసిన కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థపై (Karvy Stock Broking) ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్వీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. బుధవారం కార్వీ సంస్థలపై మరోసారి ఈడీ అధికారులు పలు చోట్ల సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటుగా.. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో(Hyderabad) మొత్తం ఆరు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. కార్వీ సంస్థ చైర్మన్ పార్థసారథి (Parthasarathy) ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఇక, డీ మ్యాట్‌ అకౌంట్ల నుంచి షేర్‌లను బదలాయించుకుని కార్వీ సంస్థ పెద్ద ఎత్తున మోసానికి పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. నిధుల గోల్‌మాల్‌, కస్టమర్ల నగదు స్వాహా చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే కార్వీ సంస్థ మనీలాండరింగ్‌కు పాల్పడినట్టుగా ఈడీ అభియోగాలు మోపింది. కొన్ని రోజుల కిందట కార్వీ సంస్థ, దాని అనుబంధ సంస్థలపై ఈడీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. కార్వీ చైర్మన్ పార్థసారథిని ఇప్పటికే మూడు రోజుల పాటు విచారించిన ఈడీ.. నిధుల గోల్మాల్‌పై విచారణ చేపట్టింది.

  ఇక, కార్వీ సంస్థపై హైదరాబాద్‌లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో(Hyderabad Central Crime Station) కూడా కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఇప్పటికే కార్వీ సంస్థ ఛైర్మన్ పార్థసారథి, సీఈఓ కృష్ణహరి, సీఓఓ రాజీవ్ సింగ్‌, కంపెనీ సెక్రటరీ శైలజను అరెస్ట్ చేశారు. ఇక, కార్వీ అక్రమాల్లో కీలక పాత్ర పోషించిన ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకృష్ణ గురజాడను సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్ట్ (Arrest) చేశారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

  PM Modi US Visit: అమెరికా పర్యటనకు బయలుదేరిన మోదీ.. అందుకోసమే ఈ పర్యటన అని ట్వీట్..

  సంస్థ చైర్మన్ పార్థసారథితో కలిసి శ్రీకృష్ణ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు(Bank Loans) సొంతానికి వినియోగించుకోవడానికి ప్రణాళికలు వేశాడు. శ్రీకృష్ణ.. కొన్నేళ్లుగా సంస్థ షేర్లు, డీమ్యాట్‌ ఖాతాల వ్యవహారాలను పరిశీలిస్తున్నాడు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఆయన డొల్ల కంపెనీలకు మళ్లించాడు. పెట్టుబడిదారులకు నష్టం చేకూర్చే విధంగా శ్రీకృష్ణ వ్యవహరించాడు. అంతేకాకుండా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు.

  Viral video: బాలుడి తలపై గిన్నె పెట్టి హెయిర్ కటింగ్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!

  బెంగళూరు పోలీసుల అదుపలోకి పార్థసారథి..
  కార్వీ సంస్థపై తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటుగా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ సంస్థ చైర్మన్ పార్థసారథి చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు చంచల్‌గూడ జైలులోనే పార్థసారథిని మూడు రోజుల పాటు విచారించారు. విచారణలో అతడు చెప్పిన వివరాల ఆధారంగా ఈడీ అధికారులు విచారణను మరింత ముమ్మరం చేశారు. రూ. 109 మోసానికి సంబంధించి బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పార్ధసారధి, కార్వీ సీఈఓ రాజీవ్ రంజన్, కృష్ణహరిలపై కేసు నమోదు చేశారు. ప్రిజనర్ ట్రాన్సిట్ వారంట్‌పై మూడు రోజులు పార్థసారథిని తమ కస్టడీకి ఇవ్వాలని బెంగుళూరు పోలీసులు కోర్టును కోరారు. ఇందుకు కోర్టు అనుమతించడంతో.. చంచల్ గూడ జైలు నుంచి పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: