Home /News /crime /

KARNTAKA CONTRACTOR SANTHOSH PATIL SUICIDE CASE BJP MINISTER KS ESHWARAPPA RESIGNS FROM HIS POSITION PAH

Contractor suicide case: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. రేపు సీఎంను కలవనున్న మంత్రి.. కారణం అదే..

మంత్రి ఈశ్వరప్ప(ఫైల్)

మంత్రి ఈశ్వరప్ప(ఫైల్)

karntaka: కర్ణాటకలో తీవ్ర రాజకీయ దుమారం కొనసాగుతుంది. మంత్రి ఈశ్వరప్ప వేధింపుల వలనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని చెప్పి.. కాంట్రాక్టర్ సంతోష్ పాటీల్ లాడ్జీలో సూసైడ్ చేసుకున్నాడు. దీనిపై తీవ్ర నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇంకా చదవండి ...
    BJP minister KS Eshwarappa resigns from his position: కన్నడ రాజకీయాల్లో కాంట్రాక్టర్ ఆత్మహత్య ఘటనపై తీవ్ర దుమారం చెలరేగుతుంది. సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ మంత్రి, వేధింపుల వలన ఆత్మహత్య చేసుకుంటున్నానని.. సీఎం, ప్రధాని మోదీ తన భార్య పిల్లలను ఆదుకోవాలంటూ సెల్పీవీడియో తీసుకొని మరీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై తీవ్ర నిరసనలు చెలరేగాయి. ఇప్పటికే ప్రతి పకాలు ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి.

    ఇక పోలీసులు ఆయనపై కేసులను నమోదు చేశారు. కర్ణాటకలో అత్యంత వివాదాస్పదుడిగా, అవినీతి పరుడిగానూ మంత్రి ఈశ్వరప్పకు పేరు ఉంది. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన కారణంగా.. ఈశ్వరప్పను కేబినెట్ నుంచి తప్పించేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఆయనపై కేసు నమోదు తర్వాత పరిణామాలు వేగంగా మారనున్నట్లు సమాచారం.ఈ క్రమంలో ఈశ్వరప్ప శుక్రవారం.. సీఎంను కలిసి తన రాజీనామాను సమర్పించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.





    సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు దారితీసిని పరిస్థితులు..

    KS Eshwarappa Responsible For My Death: కర్ణాటకలో దారుణ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. సంతోష్ పాటల్ అనే కాంట్రాక్టర్ మంత్రి వేధింపులు భరించలేక మంగళవారం హోటల్ కు వెళ్లి సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన కన్నడ నాట పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. బాధితుని కుటుంబ సభ్యలు ప్రకారం.. కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప అతని సహచరులు కొన్ని రోజులుగా కాంట్రాక్టు విషయంలో వేధింపులకు గురిచేస్తున్నారు.

    వ్యాపారంలో.. 40 శాతం కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఒత్తిడులు రోజు రోజుకి ఎక్కువ కావడంతో బాధితుడు మంగళవారం ఉడిపిలోని ఓ ప్రైవేట్ లాడ్జికి వెళ్లాడు. ఆ తర్వాత.. అక్కడ విగత జీవిగా మారాడు. సంతోష్ పాటిల్ తన సూసైడ్ నోట్ లో.. తన చావుకి.. కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సహచరులు కారణమంటూ ఆరోపించాడు.

    అదే విధంగా.. తన మరణానంతరం తన భార్య, పిల్లలకు సహాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీజేపీ సీనియర్ నేత వైఎస్ యడ్యూరప్పలను, సంతోష్ పాటీల్ సూసైడ్ నోట్‌లో కోరారు. ఆ తర్వాత.. తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా వాట్సాప్ సందేశాలు పంపాడు. ఆ తర్వాత.. ఫోన్ స్విచాఫ్ రావడంతో బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే బాధితుడు ఉన్న హోటల్ కు చేరుకున్నారు. అప్పటికే సంతోష్ పాటిల్ విగత జీవిగా పడి ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది.
    Published by:Paresh Inamdar
    First published:

    Tags: Crime news, Karantaka, Man commit to suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు