హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking : భార్య మరొకరితో జంప్..పిల్లలను చంపి మృతదేహాలతో రాత్రంతా భర్త దారుణం!

Shocking : భార్య మరొకరితో జంప్..పిల్లలను చంపి మృతదేహాలతో రాత్రంతా భర్త దారుణం!

నిందితుడు లక్ష్మీకాంత్

నిందితుడు లక్ష్మీకాంత్

Father kills chidren : కర్ణాటకలో దారుణం జరిగింది. భార్య మరికొ వ్యక్తితో జంప్ అయిందన్న కోపంలో కన్నబిడ్డలను దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. అంతేకాకుండా హత్య తర్వాత వారి మృతదేహాలను ఆటో సీటు కింద పెట్టి రోజంతా ఆటోని నడిపాడు.

Father kills chidren : కర్ణాటక(Karnataka)లో దారుణం జరిగింది. భార్య (Wife)మరికొ వ్యక్తితో జంప్ అయిందన్న కోపంలో కన్నబిడ్డలను దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. అంతేకాకుండా హత్య తర్వాత వారి మృతదేహాలను ఆటో సీటు కింద పెట్టి రోజంతా ఆటోని నడిపాడు. పాపం సీటు కింద మృతదేహాలు ఉన్నాయని తెలియక ఆ సీటుపై కూర్చొని ప్రయాణించారు చాలామంది. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు నిందితుడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో రాష్ట్రంలోని కలబుర్గిలో మంగళవారం జరిగింది.

పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. కలబుర్గి(Kalburgi)లోని బోవిగల్లిలో నివసించే లక్ష్మీకాంత్​(34 )ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం అంజలి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు లక్ష్మీకాంత్. వీరికి నలుగురు పిల్లలున్నారు. ముగ్గురమ్మాయిలు(శ్రేయ,సోని,మయూరి),ఒక అబ్బాయి(నవిత్)ఉన్నారు. భార్య, అందమైన పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగిపోతుంది. అయితే లక్ష్మీకాంత్ భర్త అంజలి మరో యువకుడితో కొన్నాళ్లుగా భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం అంజలి ప్రియుడితో కలిసి జంప్ అయింది. అప్పటి నుంచి లక్ష్మీకాంత్​ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. అనంతరం మద్యానికి బానిసయ్యాడు. అంజలి వేరే వ్యక్తితో పారిపోయినప్పటి నుంచి ఆమె పిల్లలు అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటున్నారు.


Marriage : కోడలికి మరొకరితో పెళ్లి చేసిన అత్తమామలు..కాళ్లు కడిగి కన్యాదానం..ఎందుకో తెలుసా

లక్ష్మీకాంత్​ తన పిల్లలను చూడడానికి మంగళవారం అత్తవారింటికి వెళ్లాడు. ఆటోడ్రైవర్‌ అయిన లక్ష్మీకాంత్‌ తన ఇద్దరు కుమార్తెలను తన ఆటోరిక్షాలో ఎక్కించుకుని వీరేంద్ర పాటిల్‌ ఎక్స్‌టెన్షన్‌ ప్రాంతంలోని తోట దగ్గరకు మంగళవారం సాయంత్రం తీసుకెళ్లి గొంతునులుమి హత్య చేశాడు. మృతులను సోని(10), మయూరి (8)గా గుర్తించారు.హత్య తర్వాత వారి మృతదేహాలను ఆటో సీటు కింద పెట్టి రోజంతా ఆటోని నడిపాడు. పాపం సీటు కింద మృతదేహాలు ఉన్నాయని తెలియక ఆ సీటుపై కూర్చొని ప్రయాణించారు చాలామంది. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు నిందితుడు లక్ష్మీకాంత్. మృతదేహాలు, మరో ఇద్దరు పిల్లల నవిత్, శ్రేయతో పాటు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నవిత్, శ్రేయలను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులను అభ్యర్థించాడు. పోలీసులు కేసు నమోదు చేసి లక్ష్మీకాంతాన్ని అరెస్ట్ చేశారు.

First published:

Tags: Crime news, Father, Karnataka

ఉత్తమ కథలు