దారుణం.. మహిళా కండక్టర్‌పై యాసిడ్ దాడి...

ఓ మహిళా బస్సు కండక్టర్‌(35)పై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడి చేశారు. బాధితురాలిని తూముకూరు జిల్లాకు చెందిన ఇందిరా బైరిగా గుర్తించారు.

news18-telugu
Updated: December 20, 2019, 10:44 AM IST
దారుణం.. మహిళా కండక్టర్‌పై యాసిడ్ దాడి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ మహిళా బస్సు కండక్టర్‌(35)పై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడి చేశారు. బాధితురాలిని తూముకూరు జిల్లాకు చెందిన ఇందిరా బైరిగా గుర్తించారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఘటనపై బెంగళూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్(BMTC)లో ఆమె కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణలో దిశా నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత కూడా మహిళల పట్ల అఘాయిత్యాలకు తెరపడలేదు.మహిళల భద్రతకు ప్రభుత్వాలు కొత్త చట్టాలు తెస్తున్నా.. అవేవి నేరాలను అరికట్టలేకపోతున్నాయి. దీంతో మహిళల భద్రతపై ఆందోళన నెలకొంది.

First published: December 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు