ఆసుపత్రి ఖర్చులు భరించలేక... కన్న కూతురిని చంపేసిన ‘తాగుబోతు’ తండ్రి...

కూతురి ఆరోగ్యం ఎంతకీ బాగుపడకపోవడంతో తాగుడుకి బానిసైన తండ్రి... ఆసుపత్రి ఖర్చులు భరించలేక విషం ఇచ్చి హత్య...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 11, 2019, 6:10 PM IST
ఆసుపత్రి ఖర్చులు భరించలేక... కన్న కూతురిని చంపేసిన ‘తాగుబోతు’ తండ్రి...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 11, 2019, 6:10 PM IST
ఆసుపత్రి ఖర్చులు భరించలేక... కన్నకూతురినే అతిదారుణంగా హత్య చేసి చంపేశాడు ఓ తాగుబోతు తండ్రి. కర్ణాటకలో జరిగిన ఈ దారుణ సంఘటన... కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని హెమ్మడి కుమ్రా గ్రామంలో 44 ఏళ్ల నాగరాజు పూజారి... కుటుంబంతో నివసిస్తున్నాడు. రోజు కూలీగా పనిచేస్తున్న నాగరాజుకు నయన అనే 11 ఏళ్ల కూతురు ఉంది. అయితే కొన్నాళ్లుగా ఆమె గుండె జబ్బుతో బాధపడుతోంది. కూతురికి గుండె జబ్బు సోకిన తర్వాత తండ్రి నాగరాజు తాగుడుకి బానిసయ్యాడు. కూతురి ఆరోగ్య పరిస్థితిని తట్టుకోలేక రోజూ తాగేవాడు. గత ఏడాది నయనకు హార్ట్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుపడలేదు. ఎంతకీ కూతురి ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తండ్రి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

కూతురి ఆరోగ్యం విషయంలో భార్యాభర్తలిద్దరికీ గొడవలు కూడా జరిగేవి. రోజూ తాగొచ్చి... భార్య సుమంగళి మీద కూతురి మీద అరిచేవాడు నాగరాజు. కూతురి ఆసుపత్రి ఖర్చులను భరించడం అతనికి భారంగా మారింది. దాంతో ఏం చేయాలో తెలియక ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు ఆ తండ్రి. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి వచ్చిన నాగరాజు... కూతురి చేత విషం తాగించాడు. నయన విషం తాగి, వాంతులు చేసుకోవడంతో భయపడిన తన చెల్లెలు అరుస్తూ బయటికి వచ్చింది. ఏమైందా అని గ్రామస్థులంతా అక్కడికి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కలవాళ్లు వచ్చి చూసేసరికి నయన స్పృహ కోల్పోయి పడి ఉంది. ఆమె నోటికి నురగలు ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... హుటాహుటిన నయనను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని తెలిపారు వైద్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నాగరాజును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి...

ప్రాణం తీసిన దురాచారం... ‘నెలసరి’ గుడిసెలో ఊపిరాడక ముగ్గురి మృతి...
ఇంట్లోనే యూనివర్సిటీ.. డబ్బు కొట్టు.. పట్టా పట్టు


దొంగతనానికి ‘సాక్ష్యం’ చెబుతానంది... అంతలోనే ఆత్మహత్య... పోలీసుల విచారణ కారణంగా...


థాయిలాండ్‌లో సౌదీ యువతికి అవమానం... ఆస్ట్రేలియా యువతుల ‘టాప్‌లెస్’ నిరసన...

Loading...

మేనల్లుడి ప్రేయసితో స్నేహం... అతిదారుణంగా చంపి... తులసి మొక్క నాటాడు...

First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...