Home /News /crime /

KARNATAKA TUMAKURU MAN KILLS SELF POISONS 3 CHILDREN AFTER WIFE ELOPES WITH LOVER IN SAUDI ARABIA PVN

Shocking : ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ భర్తకు వీడియో కాల్..పిల్లలకు కూడా విషం తాగించి భర్త ఆత్మహత్య!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Man kills self poisons 3 children : కర్ణాటక(Karnataka)లో దారుణం జరిగింది. భార్య తిరిగి రావడం లేదని విషం తాగాడు ఓ భర్త. తనతో పాటు ముగ్గురు పిల్లలకూ విషం(Poison) తాగించాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Man kills self poisons 3 children : కర్ణాటక(Karnataka)లో దారుణం జరిగింది. భార్య తిరిగి రావడం లేదని విషం తాగాడు ఓ భర్త. తనతో పాటు ముగ్గురు పిల్లలకూ విషం(Poison) తాగించాడు. పరిస్థితి విషమించడంతో హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతడు చనిపోయాడు. పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. తుమకూరు జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తుమకూరు(Tumukuru)లోని పీహెచ్​ కాలనీకి చెందిన సమీయుల్లా అనే వ్యక్తికి భార్య ,ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమీయుల్లా సమీయుల్లా భార్య సాహిరా బాను..కొద్ది రోజుల క్రితం భర్త, తల్లిదండ్రులకు చెప్పకుండా ప్రియుడితో కలిసి సౌదీ అరేబియాకి వెళ్లిపోయింది. అక్కడ పనిమనిషి ఉద్యోగం చేస్తూ ప్రియుడితో ఎంజాయ్​ చేస్తూ భర్తకు వీడియో కాల్స్​ చేస్తుండేది. సౌదీ అరేబియాలో తన ప్రేమికుడితో కలిసి వేర్వేరు ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నట్టు చూపిస్తూ సహిరా తన భర్తకు వీడియో కాల్స్ చేసిందని పోలీసులు తెలిపారు. తన కోసం కాకపోయినా కనీసం పిల్లల కోసం అయినా ఇంటికి రమ్మని భర్త ఎంత ఏడ్చినా, బతిమిలాడినా ఆమె మనసు కరగలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సమీయులల్లా తన ముగ్గురు పిల్లలకు వారి తల్లి తిరిగి రాదని చెప్పి వారితో విషం తాగించాడు. అనంతరం తానూ విషం సేవించాడు. హాస్పిటల్ కి తరలిస్తుండగా సమీవుల్లా మృతి చెందాడు. ముగ్గురు పిల్లలు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.


OMG : వేల అడుగుల ఎత్తులో విమానాన్ని ఆటోపైలట్ లో పెట్టి నిద్రపోయిన పైలట్లు..కళ్లు తెరిచాక షాక్!

మరోవైపు,అమెరికా (America)లోని లాస్ ఏంజెల్స్‌ (Los Angeles)కి చెందిన కైల్ గోర్డి (Kyle Gordy)అనే వ్యక్తి వయసు 31 ఏళ్లు. ఇతడు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ఆడవారితోడేటింగ్ చేయాలనుకున్నా అతన్ని అందరూ ఛీ కొట్టారు. అయినా కూడా ఇప్పటివరకు ఏకంగా 48 మంది పిల్లల (Children)కు తండ్రయ్యాడు . అది ఎలా అంటే, కైల్ గోర్డి ఒక స్పెర్మ్ డోనార్‌గా (Sperm Donor) పని చేస్తున్నాడు. మీడియా నివేదికల ప్రకారం, మరికొద్ది రోజుల్లో ఈ పెళ్లికాని తండ్రికి కనీసం 10 మంది పిల్లలు పుడతారు. అంటే వీర్యదానంతో హాఫ్ సెంచరీ పిల్లలను పుట్టించిన రికార్డు కూడా ఈ బ్యాచిలర్ క్రియేట్ చేయబోతున్నాడన్న మాట.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Crime news, Karnataka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు