Home /News /crime /

KARNATAKA STUDENT HIT BY TRAIN TRIGGERS MASSIVE OUTRAGE OVER NEGLIGENCE PAH

అయ్యో.. కళ్ల ముందే ఘోరం.. రైలు పట్టాలను దాటుతున్న బాలిక... అంతలోనే..

ప్రీతిపుట్ట స్వామి (ఫైల్)

ప్రీతిపుట్ట స్వామి (ఫైల్)

Karnataka: బాలికను ఆమె తండ్రి ఫుట్ ఓవర్ బ్రిడ్జి దగ్గర దింపివెళ్లాడు. ఆ తర్వాత బాలిక మెల్లగా రైలు పట్టాలను దాటుకుంటూ మరో వైపుకు వెళ్తుంది. కానీ అంతలో ఆమె కాలు రైలు పట్టాల మధ్యన ఇరుక్కుపోయింది.

రైలు పట్టాలను దాటే క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. రైలు సిగ్నల్ పడిన కూడా కొంత మంది ఆకతాయిలు కావాలని రైలు పట్టాలు దాటడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వారి ప్రాణాలు పోయిన అనేక సంఘటనలు గతంలో జరిగాయి. అదే విధంగా మరికొన్నిసార్లు.. వెంట్రుక వాసిలో ప్రమాదాల బారి నుంచి బైట పడిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. అయితే, ఇక్కడో బాలిక కూడా రైలు పట్టాలు దాటుతుండగా అనుకొని విధంగా ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ఘటనతో స్థానికులు అక్కడికి చేరుకుని, తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు.

పూర్తి వివరాలు.. కర్ణాటకలోని (Karnataka)  హాసన్ లో దారుణ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న అంక్ పూర్ గ్రామ సమీపంలో.. ప్రీతిపుట్ట స్వామి అనే 22 ఏళ్ల బాలికస్థానికంగా ఉన్న ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చివరి సంవత్సరం చదువుతుంది. ఆమెను తండ్రి పుట్టస్వామి ఆటోలో దింపి వెళ్లిపోయాడు. అప్పుడు.. ఆమె ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ క్రాస్ చేస్తుంది. ఇంతలో.. ఆమె కాలు రైలు పట్టాల మధ్యలో ఇరుక్కుంది. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది.



రైలు వేగంగా వచ్చి, బాలికపై నుంచి (Train accident)  వెళ్లిపోయింది. ఆమె శరీరం ఛిద్రంగా మారిపోయింది. వెంటనే అక్కడ స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రైల్వే అధికారులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తాము ఎప్పటి నుంచో ఇక్కడ ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పిన అధికారులు పట్టించుకొలేదని అన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు హాసన్-మైసూరు హైవేను దిగ్బంధించారు. తమ ఆగ్రహానికి గుర్తుగా టైర్లను కూడా తగులబెట్టారు.అయితే, తాము ప్రజలు ఇక్కడ నుంచి వెళ్లడం రాకపోకలు సాగించడం నిశేధించామని అధికారులు తెలిపారు. కానీ స్థానికులు పెడచెవిన పెట్టి.. ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది. బాలిక శరీరాన్ని మార్చురీకి తరలించారు. ఘటన ప్రదేశంలో పోలీసులు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండగా బిహార్‌లోని సీతామర్హి ప్రాంతానికి చెందిన ఓ యువతి కుటుంబ సభ్యులను ఓ యువకుడు అర్ధరాత్రి ఇంటికి వెళ్లి బెదిరిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. సీతామర్హి ప్రాంతంలో నివసిస్తున్న యువతి ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ఓ యువకుడు అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టాడు. అంతకు ముందు ఆమె సెల్‌ఫోన్‌కి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ ఇబ్బంది పెట్టాడు. రెండ్రోజుల క్రితం ఏకంగా యువతి ఇంట్లోకి చొరబడి తన కోరిక తీర్చమంటూ ...తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Karnataka, Train, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు