హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఇద్దరు మహిళలు మాట్లాడుకున్న వీడియో విని.. స్వామిజీ ఆత్మహత్య.. కారణం ఏంటంటే..

ఇద్దరు మహిళలు మాట్లాడుకున్న వీడియో విని.. స్వామిజీ ఆత్మహత్య.. కారణం ఏంటంటే..

బసవ సిద్దలింగ స్వామి (ఫైల్)

బసవ సిద్దలింగ స్వామి (ఫైల్)

Karnataka:  శిష్యులు, అనుచరులు రోజు మాదిరిగా స్వామిజీ గదిలోకి వెళ్లారు. అప్పటికే ఆయన విగత జీవిగా కన్పించారు. వెంటనే భక్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Karnataka, India

Karnataka Seer Found Dead: కొన్నిరోజులుగా కర్ణాటకలో షాకింగ్ ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే.. బాలికలపై అత్యాచారం చేసిన ఘటనలో.. కర్ణాటక(Karnataka)లో రాజకీయంగా శక్తివంతమైన లింగాయత్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ స్వామీజీ శివమూర్తి శరణారావు (Shivamurthy Sharanaru)ను ఎట్టకేలకు పోలీసులు గురువారం అరెస్టు చేసి, కోర్టు ముందు హజరు పర్చారు. కాగా, కోర్టు ఆయనకు పోలీసు కస్టడీకి విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈరోజు మరో షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా ఉన్న శ్రీ గురు మడివాళేశ్వర మఠం పీఠాధిపతి బసవ సిద్దలింగ స్వామి ఆయన క్వార్టర్స్ లో ఉరివేసుకొని విగత జీవిగా కన్పించారు.

అయితే.. ప్రతిరోజు మాదిరిగానే ఆయన అనుచరులు, భక్తులు ఆయనను లేపడానికి వెళ్లారు. అప్పటికే ఆయన చనిపోయి కన్పించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే గదిలో సూసైడ్ నోట్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే.. కర్ణాటకలో ఇటీవల లింగాయత్ స్వామిజీ లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. అయితే.. ఆ వీడియోలో బసవ సిద్ధ లింగ స్వామి పేరును ఇద్దరు మహిళలు చర్చించుకున్నారు.

దీంతో స్వామిజీ ఇది విని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన సూసైడ్ చేసుకున్నట్లు ఆయన అనుచరులు, స్థానికులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ నెల ప్రారంభంలో.. రాష్ట్రంలోని కీలకమైన లింగాయత్ సెమినరీలలో ఒకటైన మురుగ మఠానికి అధిపతిగా ఉన్న శివమూర్తి శరణారావును ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అరెస్టు చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. కొన్నాళ్లుగా తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాలికలిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వరుస ఘటనలు తీవ్ర కలకలంగా మారాయి. అయితే.. దీనిపై ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా స్పందించలేదు.

ఇదిలా ఉండగా గతంలో కర్ణాటకలో ప్రముఖ‌ లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణుపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలంగా మారిన విషయం తెలిసిందే.  దీంతో ఇది రాజకీయంగాను తీవ్ర దుమారంగా మారింది. మఠం నడుపుతున్న పాఠశాలలో చదువు కుంటున్న బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యామని పోలీసులకు తెలియజేయడంతో ఘటన వెలుగులోనికి వచ్చింది. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి, మఠాధిపతిని కోర్టులో హజరుపర్చారు. కోర్టులో ఘటనపై వాదోపవాదనలు జరిగాయి.

ఈ క్రమంలో కోర్టు.. మఠాధిపతికి నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీని ఇస్తు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. అనారోగ్య కారణాలతో మఠాధిపతి వీల్ చైర్ లోనే విచారణకు హజరయ్యారు. కాగా, మఠాధిపతిని అరెస్టు చేయడంతో కన్నడ నాట అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గురువారం రాత్రి పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అదే విధంగా.. చిత్రదుర్గ ఆస్పత్రిలో టెస్ట్ లు చేశారు. ఆ తర్వాత.. జైలుకు తరలించారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Karnataka, Suicide hanging

ఉత్తమ కథలు