హోమ్ /వార్తలు /క్రైమ్ /

Viral: ఇదేదో రికార్డింగ్ డ్యాన్స్‌లో సీన్ కాదు.. వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ఉంది ఎవరో తెలిస్తే..

Viral: ఇదేదో రికార్డింగ్ డ్యాన్స్‌లో సీన్ కాదు.. వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ఉంది ఎవరో తెలిస్తే..

వైరల్ అయిన రత్నాకర్ ఫొటో

వైరల్ అయిన రత్నాకర్ ఫొటో

అతనో బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగి. వయసు 40 సంవత్సరాలకు పైగానే ఉంటుంది. భార్యాపిల్లలతో సంతోషంగా గడపాల్సిన ఆ వ్యక్తి ఆలోచన పెడతోవ పట్టింది. తనకు ఉన్న అధికారంతో కింది స్థాయి మహిళా ఉద్యోగులను వశపరుచుకోవడం, వారితో కలిసి కార్యాయలంలోనే వెకిలి వేషాలు వేయడం.

ఇంకా చదవండి ...

అతనో బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగి. వయసు 40 సంవత్సరాలకు పైగానే ఉంటుంది. భార్యాపిల్లలతో సంతోషంగా గడపాల్సిన ఆ వ్యక్తి ఆలోచన పెడతోవ పట్టింది. తనకు ఉన్న అధికారంతో కింది స్థాయి మహిళా ఉద్యోగులను వశపరుచుకోవడం, వారితో కలిసి కార్యాయలంలోనే వెకిలి వేషాలు వేయడం. ఈ ప్రబుద్ధుడి నిర్వాకం బయటకు పొక్కడం.. ఇతగాడు మహిళా ఉద్యోగులతో వేస్తున్న వేషాలకు సంబంధించిన ఫొటో వైరల్ కావడంతో సదరు ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. డాక్టర్ రత్నాకర్ అనే వ్యక్తి కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్నాడు. దక్షిణ కన్నడ జిల్లాలో జిల్లా స్థాయి వైద్యాధికారిగా పనిచేస్తున్న రత్నాకర్ తన కార్యాలయంలో ఇద్దరు మహిళా ఉద్యోగులను మీద కూర్చోబెట్టుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Nellore: వాగు ప్రవాహంలో చికుకున్న వారిని రక్షిస్తున్న NDRF సిబ్బంది


నవంబర్ 26 నుంచి ఈ ఫొటో కర్నాటక సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫొటోపై మీమ్స్ కూడా వస్తున్నాయి. బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి మహిళా ఉద్యోగులతో కలిసి ఇవేం పనులంటూ డాక్టర్ రత్నాకర్‌ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

రత్నాకర్ (ఫైల్ ఫొటో)

మంగళూరులోని తన కార్యాలయంలో ఇద్దరు మహిళలతో ఇతగాడు వెలగబెడుతున్న రాచకార్యాలకు ఈ ఫొటోనే నిదర్శనం. రత్నాకర్ ‘Leprosy Eradication Wing’ లో నోడల్ అధికారిగా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: Shocking Incident: పెళ్లికి వెళ్లి బైక్‌పై తిరిగి ఇంటికి వెళుతుండగా ఊహించని ఘటన

ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో మంగళూరు మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు రత్నాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వైరల్ అయిన ఫొటోలు, వీడియోలపై రత్నాకర్‌తో కనిపించిన మహిళలను ప్రశ్నించగా తనకు సహకరించకపోతే రత్నాకర్ టార్గెట్ చేసేవాడని.. తమలో కొందరు మహిళలను బలవంతంగా తనతో పాటు టూర్లకు కూడా తీసుకెళ్లేవాడని.. వాళ్లతో ఫొటోలు, వీడియోలు తీసుకునేవాడని చెప్పారు.

రాష్ట్ర మంత్రిపై రూ.1000,00,00,000 పరువునష్టం దావా..మంగళూరు కమిషనర్ ఎన్.ఏ.శశికుమార్ మాట్లాడుతూ.. నిందితుడు రత్నాకర్‌ను కస్టడీకి తరలించినట్లు తెలిపారు. రత్నాకర్ ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో అతనిని విధుల నుంచి తప్పిస్తున్నట్లు వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది.

First published:

Tags: Crime news, Karnataka, Viral photo

ఉత్తమ కథలు