గుండెపోటుతో మృతి చెందిన మంత్రి..అందోళనలో అభిమానులు

కర్ణాటక మంత్రి చన్నబసప్ప సత్యప్ప శివల్లీ శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. యాబై ఎనిమిది సంవత్సారల రాష్ట్రంలో పురపాలక శాఖ మంత్రిగా పని చేస్తున్నారు.

news18-telugu
Updated: March 23, 2019, 4:37 AM IST
గుండెపోటుతో మృతి చెందిన మంత్రి..అందోళనలో అభిమానులు
కర్ణాటక మంత్రి చన్నబసప్ప సత్యప్ప Photo: Twitter
news18-telugu
Updated: March 23, 2019, 4:37 AM IST
కర్ణాటక మంత్రి చన్నబసప్ప సత్యప్ప శివల్లీ శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. యాబై ఎనిమిది సంవత్సారల రాష్ట్రంలో పురపాలక శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. చన్నబసప్ప పనిలో భాగంగా..రాష్ట్రంలోని ధార్వాడలో కొంతమంది ప్రజలతో మాట్లాడుతున్న సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన హుబ్లిలోని ఓ ప్రైవేటు దవఖానకు తరలించారు. అయితే పరిస్థితి అదుపుతప్పడంతో..చన్నబసప్ప చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఆయనకు కొన్ని నెలల క్రితం బైపాస్‌ సర్జరీ జరిగింది. ధార్వాడలో ఇటీవల నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి కొంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్న తీరున పరీశీలిస్తూ.. మూడు రోజులుగా ఆయన అక్కడే ఉంటుంన్నారు. అయితే మంత్రి మృతి వార్త తెలుసుకున్న ఆయన మద్దతుదారులు వేల సంఖ్యలో దవఖానకు వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ధార్వాడ జిల్లాలోని కుంద్గోల్‌ నుంచి పోటీ చేసి ఆయన మూడుసార్లు గెలుపొందారు.

First published: March 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...