Home /News /crime /

KARNATAKA MOTHERS EXTRA MARITAL AFFAIR LEADS TO END HER DAUGHTERS LIFE MINOR GIRL COMMITS SUICIDE HERE IS THE FULL DETAILS SRD

Illegal Affair: డబ్బు కోసం తల్లి చేసిన పాడుపని.. ఆ కూతురి పాలిట శాపంగా మారింది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Illegal Affair: పేద, మధ్య తరగతి వారి జీవితాల్లో రకరకాల మలుపులు ఉంటాయి. పైకి చూస్తే ఒకలా... తరచి చూస్తే మరోలా కనిపించే కథలుంటాయి. అలాంటి ఓ కథ ఇది.

  అది కర్ణాటకలోని... చిక్‌మంగళూరు. కదూర్ తాలూకా. ఎస్ బారే గ్రామం. తెల్లారే... ఓ ఇంట్లో పెద్దగా ఏడుపులు వినిపిస్తున్నాయి. పొలాలకు వెళ్లాలనుకునేవారు కాస్తా... ఆగి పోయి.. ఏమైంది ఏమైంది అనుకుంటూ ఆ ఇంటివైపు వెళ్లారు. చూస్తే... ఆ ఇంట్లో ఓ విషాదం. టీనేజీ అమ్మాయి... ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకుంది. తల్లి తల బద్ధలయ్యేలా కొట్టుకుంటూ ఏడుస్తోంది. వెంటనే అది చూసిన వారి మనసుల్లో వచ్చిన ప్రశ్న ఒకటే... ఎందుకు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది.... వారిలో వారికే ఓ సమాధానం దొరికింది. కారణం తల్లే అన్నారు. తల్లి వల్లే తల్లడిల్లి... భరించలేక ఆ అమ్మాయి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయిందనుకున్నారు. విషయం పోలీసులకు తెలిసింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. తల్లిని అదుపులోకి తీసుకున్నారే గానీ... కారణం అమేనా అన్నది వారికే అర్థం కాలేదు.

  ఇదీ అసలు విషయం:
  పూర్ణిమ ( పేరు మార్చాం) ది హైస్కులుకు వెళ్లి చదువుకునే ఏజ్. రోజూ స్కూలుకు వెళ్లి... బాగా చదువుకొని ఇంటికి వచ్చేది. పెద్దయ్యాక ఏమవుతావంటే... ప్రపంచమంతా తిరుగుతా అనేది. పైలట్ అవ్వు టీచర్లు సలహా ఇచ్చారు. అదే కలల ప్రపంచం అయ్యింది. రోజూ పైలట్ ఎలా అవ్వాలి అనే ఆలోచిస్తూ... చదువు సాగించేది.

  పూర్ణిమ తండ్రి లక్ష్మణ శెట్టి, తల్లి లీలావతి (పేరు మార్చాం). ఇద్దరూ ఊళ్లోనే చిన్నా చితకా పనులు చేసుకొని జీవిస్తారు. కూతుర్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఇంతలో కరోనా వచ్చింది. కష్టాలు పెరిగాయి. ఖర్చులు తగ్గలేదు. చేతిలో డబ్బులేని పరిస్థితి. ఇలాంటి సమయంలో... లీలావతితో పరిచయం పెంచుకున్నాడు రంగస్వామి. ఆ ఊళ్లో అతనికి తిరుగులేదు. కావాల్సినంత డబ్బుంది. సంపన్నుడు అని అంతా లేని గౌరవాన్ని ఉన్నట్లు చూపించేవారు.

  లక్ష్మణ శెట్టి ఇంట్లో లేనప్పుడు... పూర్ణిమ స్కూలుకు వెళ్లినప్పుడు రంగస్వామి ఇంటికి వచ్చేవాడు... ఆ తర్వాత తిరిగి సైలెంట్‌గా వెళ్లిపోయేవాడు. అతను ఇచ్చే డబ్బే ఆ ఇంటికి ఆధారం అయ్యింది. ఓ రోజు ఎవరో తోటి విద్యార్థినులు ఈ విషయం పూర్ణిమకు చెప్పారు. ఆమె నమ్మలేదు. ఇంటికెళ్లి తల్లినే అడగమన్నారు. అడిగింది. తల్లి మౌనంగా ఉండిపోయింది. అంతే... పూర్ణిమలో ఏదో అసహనం మొదలైంది. తల్లి పట్ల ఉన్న ప్రేమ మాయమైంది.

  అప్పటి నుంచి తల్లీ కూతురి మధ్య ఎడబాటు పెరిగింది. తల్లి ఏం చెప్పినా కూతురు పట్టించుకోకపోవడం... చిరాకు పడటం... ఇలా ప్రతీ విషయంలో తల్లికి విరుద్ధంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది పూర్ణిమ.పూర్ణిమ ఎందుకు అలా చేస్తోందో లీలావతికి తెలుసు. కానీ పరిస్థితులు తన కంట్రోల్‌లో లేవని ఆమె భావించింది. లక్ష్మణ శెట్టి కూడా పద్ధతి మార్చుకోమని భార్యకు తరచూ చెబుతూనే ఉన్నాడు. కానీ డబ్బు... ఆమెను అటువైపే నడిపించింది.

  ఇది కూడా చదవండి : పనిమనిషిగా పనిచేస్తున్న యువతితో లవ్.. ఆమె పనిచేసే ఇంటికి రాత్రి 11 గంటలకు గోడ దూకి వెళ్లగా..

  ఇంట్లో పరిస్థితులను చూసి చూసీ... స్కూల్లో తోటి అమ్మాయిలు అనే మాటలు వినీ వినీ జీవితంపై విరక్తి తెచ్చుకుంది పూర్ణిమ. ఈ బతుకు బతకడం కంటే చావే మేలు అనుకుంది. తను చస్తేనైనా తల్లి మనసు మారుతుందేమో అనుకుంది. ప్రాణాలు వదిలేసింది. వివాహేతర సంబంధాలు తప్పు కాదని సుప్రీంకోర్టు ఓ కేసులో చెప్పడంతో... ఈ కేసులో ఎవరిని తప్పు పట్టాలో పోలీసులకు అర్థం కావట్లేదు. దర్యాప్తు కొనసాగుతోంది అనే రొటీన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Crime news, Extra marital affair, Illegal affair

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు