హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: అతనికి భార్య, ఇద్దరు కొడుకులు.. పక్క ఊరి మహిళతో ఎఫైర్.. ఆమె కోసం అన్ని చేస్తుంటే..

Shocking: అతనికి భార్య, ఇద్దరు కొడుకులు.. పక్క ఊరి మహిళతో ఎఫైర్.. ఆమె కోసం అన్ని చేస్తుంటే..

హత్యకు గురైన వినోద్

హత్యకు గురైన వినోద్

వినోద్​(45)కు భార్య బిను(42), పెద్ద కొడుకు వివేక్ (21), చిన్న కొడుకు విష్ణు (19) ఉన్నారు. అయితే వినోద్‌కు సమీప గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.

అతడికి పెళ్లైంది.. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ ఉన్నట్టుండి అతడు మృతిచెండం తీవ్ర కలకలం రేపింది. అయితే ఇందుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని (Karnataka) శివమొగ్గ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. శివమొగ్గ జిల్లా (Shivamogga district) అచాపుర గ్రామానికి చెందిన వినోద్​(45)కు భార్య బిను(42), పెద్ద కొడుకు వివేక్ (21), చిన్న కొడుకు విష్ణు (19) ఉన్నారు. అయితే వినోద్‌కు సమీప గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం వినోద్ కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది. దీంతో కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. వినోద్‌ను పద్దతి మార్చుకోవాలని కుటుంబ సభ్యులు అంతా చెప్పిచూశారు. కానీ వినోద్ వినిపించుకోలేదు. ఇటీవల వినోద్ తమ భూమిని అమ్మాడు. అందులో పెద్దమొత్తం వాటాను సదరు మహిళకు ఇవ్వాలనుకున్నాడు. అంతేకాకుండా మరో ప్రాపర్టీని కూడా అమ్మేందుకు సిద్దమయ్యాడు.

వినోద్ ప్రవర్తన‌తో కుటుంబ సభ్యులు విసుగు చెందారు. అలా చేయవద్దని అతడిని కోరారు. కానీ వినోద్ వినిపించుకోకపోవడంతో.. అతడిని ఎలాగైనా హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం వినోద్ భార్య బిను, ఇద్దరు కొడుకులు, బిను సోదరి కొడుకు అశోక్(23), వినోద్ సోదరుడు సంజయ్‌(36) ప్రణాళికలు రచించారు.

MLA Roja: రాజకీయాల్లో రఫ్ఫాడించే రోజా.. ఆపద వస్తే అమ్మలా ఆదరిస్తున్న వైసీపీ ఫైర్ బ్రాండ్..


వినోద్‌ను హత్య చేయడం కోసం నిందితులు పెట్రోల్ కొనుగోలు చేశారు. తొలుత వినోద్‌ను ఇనుప తీగ గొంతుకు బిగించి, తలపై ఇనుపరాడ్‌తో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని కారులో ఉంచి హునాసెకొప్ప అటవీ ప్రాంతానికి తరలించారు. అనంతరం కారు డ్రైవింగ్ సీటులో వినోద్‌ను ఉంచి.. తగలబెట్టారు. ఇందుకు సంబంధించి వినోద్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా అతని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ప్రాథమికంగా వినోద్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావించారు. అయితే విచారణలో వినోద్ కుటుంబ సభ్యులు.. పొంతనలేని సమాధానాలు చెప్పారు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు కేసును అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

Extramarital Affair: ఊరిలో భార్య, పిల్లలు.. అద్దె ఇంట్లో ప్రేయసితో సహజీవనం.. భార్యకు అనుమానం.. చివరకు..


ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులే హత్య చేసినట్టుగా తేలింది. దీంతో పోలీసులు వినోద్ భార్య బిను, కొడుకులు వివేక్, విష్ణు, బంధువులు అశోక్, సంజయ్‌లను శుక్రవారం అరెస్ట్ చేశారు.

First published:

Tags: Crime news, Karnataka

ఉత్తమ కథలు