ఫోన్‌లో అమ్మాయిల ఫోటోలు చూసిన ఎమ్మెల్యే... ఏం చెప్పారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే...

కర్ణాటక అసెంబ్లీలో బీఎస్పీకి చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే మహేశ్ ఫోన్‌లొ అమ్మాయి ఫోటోను చూశారు. అది కాస్తా కెమెరా కంటికి చిక్కడంతో విషయం సంచలనంగా మారింది. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు సదరు ఎమ్మెల్యే ఓ వింత కారణం చెప్పడం మరో విశేషం.

news18-telugu
Updated: December 19, 2018, 6:38 PM IST
ఫోన్‌లో అమ్మాయిల ఫోటోలు చూసిన ఎమ్మెల్యే... ఏం చెప్పారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రజాసమస్యల గురించి చర్చించాల్సిన చట్టసభల్లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడం నిషేధం. మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ నిబంధన అమల్లో ఉంది. అయితే మన ఓట్లతో గెలిచిన మన ప్రజాప్రతినిధులు మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఈ విషయంలో వారిని తనిఖీ చేయాల్సిన అధికారులు కూడా అంత ధైర్యం చేయరు. ఎఫ్పుడో కెమెరా కంటికి చిక్కి... అది బయటకు పొక్కినప్పుడు మాత్రమే దీనిపై స్పీకర్లు చర్యలు తీసుకోవడం జరుగుతుంటుంది. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలోనే ఫోన్ తెరిచి అందులో అమ్మాయి ఫోటోను చూడటం సంచలనంగా మారింది.

కర్ణాటక అసెంబ్లీలో బీఎస్పీకి చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే మహేశ్... అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. సభలో పాల్గొన్న సమయంలోనే తన ఫోన్ తీసి అందులో అమ్మాయిల ఫోటోలను చూడడం మొదలెట్టారు. అది కాస్తా కెమెరాల కంటికి చిక్కడంతో విషయం సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన సదరు ఎమ్మెల్యే... సంచలనం కోసం ప్రతి విషయాన్ని మీడియా పెద్దది చేస్తోందంటూ మండిపడ్డారు. ఇంతవరకు బాగానే ఉన్నా... అసలు ఆ అమ్మాయిలు ఎవరు, అసలు తాను ఎందుకు ఆ ఫోటోలు చూడాల్సి వచ్చిందనే విషయంపై ఎమ్మెల్యే ఇచ్చిన వివరణ విని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

తాను సెల్‌ఫోన్‌ను అసెంబ్లీలోకి తీసుకెళ్లడం పొరపాటే అని అంగీకరించిన ఎమ్మెల్యే మహేశ్... మరోసారి ఇలాంటి పొరపాటు చేయబోనని వ్యాఖ్యానించారు. తన కుమారుడికి పెళ్లి చేసేందుకు అమ్మాయి కోసం వెతుకుతున్నానని తెలిపిన ఎమ్మెల్యే... తన స్నేహితుడు ఓ అమ్మాయి ఫోటో పంపించడం వల్లే చూశానని వివరణ ఇచ్చారు. దీన్ని మరోలా చూపించవద్దని కోరాడు. ఇది చాలా దురదృష్ణకరమని ఎమ్మెల్యే మహేశ్ వివరణ ఇచ్చుకున్నారు.


2012లో కర్ణాటక అసెంబ్లీలో ముగ్గురు బీజేపీ మంత్రులు అశ్లీల వీడియోలు చూస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఇది అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఆ ముగ్గురు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. అప్పటి నుంచి కర్ణాటక అసెంబ్లీలో సెల్ ఫోన్లను తీసుకురావడంపై నిషేధం విధించారు.
Published by: Kishore Akkaladevi
First published: December 19, 2018, 6:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading