Home /News /crime /

KARNATAKA MINISTER KS ESHWARAPPA RESPONSIBLE FOR MY DEATH CONTRACTORS LAST MESSAGE PAH

Shocking: ‘నా చావుకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి  కారణం’.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్..

సంతోష్ పాటిల్ (ఫైల్)

సంతోష్ పాటిల్ (ఫైల్)

Death Tragedy Of Contractor: మంత్రి తనను కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని కాంట్రాక్టర్ ఆందోళనకు గురయ్యాడు. మానసికంగా ఒత్తిడులు భరించలేక తాను.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వాట్సాప్ మెసెజ్ పంపాడు.

KS Eshwarappa Responsible For My Death: కర్ణాటకలో దారుణ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. సంతోష్ పాటల్ అనే కాంట్రాక్టర్ మంత్రి వేధింపులు భరించలేక మంగళవారం హోటల్ కు వెళ్లి సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన కన్నడ నాట పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. బాధితుని కుటుంబ సభ్యలు ప్రకారం.. కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప అతని సహచరులు కొన్ని రోజులుగా కాంట్రాక్టు విషయంలో వేధింపులకు గురిచేస్తున్నారు.

వ్యాపారంలో.. 40 శాతం కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఒత్తిడులు రోజు రోజుకి ఎక్కువ కావడంతో బాధితుడు మంగళవారం ఉడిపిలోని ఓ ప్రైవేట్ లాడ్జికి వెళ్లాడు. ఆ తర్వాత.. అక్కడ విగత జీవిగా మారాడు. సంతోష్ పాటిల్ తన సూసైడ్ నోట్ లో.. తన చావుకి.. కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సహచరులు కారణమంటూ ఆరోపించాడు.





అదే విధంగా.. తన మరణానంతరం తన భార్య, పిల్లలకు సహాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీజేపీ సీనియర్ నేత వైఎస్ యడ్యూరప్పలను, సంతోష్ పాటీల్ సూసైడ్ నోట్‌లో కోరారు. ఆ తర్వాత.. తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా వాట్సాప్ సందేశాలు పంపాడు. ఆ తర్వాత.. ఫోన్ స్విచాఫ్ రావడంతో బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే బాధితుడు ఉన్న హోటల్ కు చేరుకున్నారు.

అప్పటికే సంతోష్ పాటిల్ విగత జీవిగా పడి ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది. మంత్రి దీనికి బాధ్యత వహిస్తూ.. వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అయితే, దీన్ని మంత్రి ఈశ్వరప్ప ఖండించారు. నాకు మీడియాతో ఈ విషయం తెలిసిందన్నారు. నాకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన కలకలంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Karnataka, Man commit to suicide

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు