• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • KARNATAKA MARRIED WOMAN DIES BY SUICIDE AFTER HAVING SEXUAL AFFAIR WITH MARRIED MAN SSR

Married Woman: వివాహేతర సంబంధం.. అఫైర్ పెట్టుకున్న అతని ఒడిలోనే పోయిన ఆమె ప్రాణం..

ప్రతీకాత్మక చిత్రం

కర్ణాటకలోని విజయపుర జిల్లా గంగూరు గ్రామానికి చెందిన రేణుక(36), అశోక్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. రేణుక భర్త అశోక్ కొన్నేళ్లుగా ఉపాధి నిమిత్తం కేరళకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే హడలగేరి గ్రామానికి చెందిన బసవరాజు పరిచయమయ్యాడు. ఇతనికి ఆరుగురు పిల్లలు.

  • Share this:
    బెంగళూరు: ఆయన వయసు 40 సంవత్సరాలు. ఆమె వయసు 36 సంవత్సరాలు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసి ఇద్దరినీ మందలించారు. ఇక.. తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం కష్టమని భావించిన ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నారు. పురుగుల మందు కొనుక్కుని ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్లారు. ఇద్దరూ పురుగుల మందు తాగారు. కొన్ని నిమిషాల్లోనే ఆమె పరిస్థితి విషమించి అతని ఒడిలోనే బాధతో విలపిస్తూ రక్తపు వాంతులు కావడంతో కాసేపటికే చనిపోయింది. అటుగా అడవిలో వెళుతున్న గొర్రెల కాపరులు కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ.. అతను ఒప్పుకోలేదు. ఈ ఘటనను ఓ గొర్రెల కాపరి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. అతనిని గొర్రెల కాపరులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని విజయపుర జిల్లా గంగూరు గ్రామానికి చెందిన రేణుక(36), అశోక్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. రేణుక భర్త అశోక్ కొన్నేళ్లుగా ఉపాధి నిమిత్తం కేరళకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే హడలగేరి గ్రామానికి చెందిన బసవరాజు పరిచయమయ్యాడు. ఇతనికి ఆరుగురు పిల్లలు. బసవరాజుకు, రేణుకకు మొదలైన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

    ఈ ఇద్దరి వివాహేతర సంబంధం గురించి ఇరు కుటుంబాలకు తెలియడంతో గొడవలు కూడా జరిగాయి. రేణుకను, బసవరాజును కుటుంబ సభ్యులు మందలించారు. ఈ నేపథ్యంలో.. ఇక ఇద్దరూ కలిసి ఉండటం కుదరదని తీవ్ర మనస్తాపం చెందిన రేణుక, బసవరాజు తమకు వేరువేరుగా పెళ్లి అయి పిల్లలున్నారన్న సంగతి కూడా మర్చిపోయి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి పురుగుల మందు తీసుకుని వెళ్లారు. ఇద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత పురుగుల మందు తాగారు. తాగిన కొంతసేపటికే రేణుక రక్తపు వాంతులు చేసుకుంది.

    ఆమెను ఒడిలోకి తీసుకున్న బసవరాజు ఎంతో బాధపడ్డాడు. అతని ఒడిలోనే ఆమె చనిపోయింది. వీళ్లిద్దరినీ అటుగా వెళుతున్న గొర్రెలు కాపరులు చూసి కాపాడే ప్రయత్నం చేశారు. రేణుక చనిపోయిందని, తనను కూడా కాపాడొద్దని.. బసవరాజు కొంతమేర మాత్రమే పురుగుల మందు తాగడంతో అతనిని బలవంతంగా గొర్రెల కాపరులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ దృశ్యాలను గొర్రెల కాపరుల్లో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పెళ్లయి పిల్లలున్న ఈ ఇద్దరూ ఇళా చేయడమేంటని నెటిజన్లు దుమ్మెత్తిపోశారు.
    Published by:Sambasiva Reddy
    First published: