హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: అంత మాత్రానికి యాసిడ్ తో దాడిచేయాలా.. తోటి ఉద్యోగినిపై అందుకు నో చెప్పిందని.. 

OMG: అంత మాత్రానికి యాసిడ్ తో దాడిచేయాలా.. తోటి ఉద్యోగినిపై అందుకు నో చెప్పిందని.. 

నిందితుడు అహ్మద్ (ఫైల్)

నిందితుడు అహ్మద్ (ఫైల్)

Karnataka: ఇద్దరు ఒకే దగ్గర పనిచేస్తున్నారు. కొంత కాలం నుంచి స్నేహంగా ఉంటున్నారు. ఆమె భర్తనుంచి విడాకులు తీసుకుని సపరేట్ గా ఉంటుంది.

కొందరు మహిళల పట్ల సైకోలుగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమను తిరస్కరించారని, పెళ్లికి వద్దన్నరని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కొందరు మరీ పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. తమకు దక్కని వారు.. ఎవరికి దక్కకుడదని క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. కొన్నిచోట్ల యాసిడ్ దాడులకు పాల్పడుతున్నారు. మరికొందరు నీచులు, హత్యలు చేయడానికి సైతం వెనుకాడటం లేదు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలో (Karnataka)  దారుణం జరిగింది. బెంగళూరులోని ఒక ప్రైవేటు ఫ్యాక్టరీలో అహ్మద్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడిని అదే కంపెనీలో పనిచేస్తున్న మరో మహిళతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు చనువుగా ఉండేవారు. ఆమెకు ముగ్గురు పిల్లలు. భర్తతో విడాకులు తీసుకుని ఉంటుంది. అతను కొన్ని రోజులుగా పెళ్లి చేసుకుందామంటూ ఆమెను వేధింస్తుండేవాడు. అతని వేధింపులు భరించలేక, మహిళ పెళ్లికి నిరాకరించింది. దీంతో కోపం పెంచుకున్నాడు.

ఒక రోజు ఫ్యాక్టరీ మార్గంలో ఆమె దగ్గరకు వెళ్లాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే తన జేబులోని యాసిడ్ బాటిల్  (Acid attack) తీసుకుని ఆమె ముఖంపై వేశాడు. దీంతో ఆమె అక్కడే కుప్పకూలిపడింది. వెంటనే ఆమెను స్థానికులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో కొలుకుంటుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా వితంతు పింఛన్ ఇప్పిస్తానని చెప్పి   ఒక వ్యక్తి వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు.

గుజరాత్ లో (Gujarat) దారుణం జరిగింది. కామాంతో కళ్లు మూసుకుపోయిన ఒక వ్యక్తి వృద్ధురాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటన బొటాడ్ పరిధిలో జరిగింది. స్థానికంగా ఉండే హస్ముఖ్ దేవిపూజక్ అనే వ్యక్తి, తన ఇంటికి సమీపంలో ఉండే 75 ఏళ్ల వృద్ధురాలి (Female harassment) దగ్గరకు వెళ్లాడు. ఆమెకు పింఛన్ ఇప్పిస్తానని చెప్పాడు. ఆమెను ఆటోలో ఎక్కించుకుని కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ ఒక నిర్జల ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరికైన చెబితే కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు.

ఆ తర్వాత.. వంద రూపాయలు ఇచ్చి, ఆటోలో ఇంటికి వెళ్లమన్నాడు. ఈ ఘటన గురువారం జరిగింది. తొలుత మహిళ ఇంట్లో చెప్పడానికి భయపడింది. ఆ తర్వాత ధైర్యం చేసుకొని చెప్పింది. ఈ క్రమంలో వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.అతడిని శుక్రవారం అరెస్టు చేశారు. వృద్ధురాలిని టెస్టుల కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Female harassment, Harassment on women, Karnataka

ఉత్తమ కథలు