కర్ణాటకలో ఐఏఎస్ అధికారి ఆత్మహత్య

ఐఎంఎ స్కాం వెలుగు చూసిన సమయంలో విజయ శంకర్ బెంగళూరు అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నారు.

news18-telugu
Updated: June 23, 2020, 9:57 PM IST
కర్ణాటకలో ఐఏఎస్ అధికారి ఆత్మహత్య
విజయశంకర్(ఫైల్ ఫోటో)
  • Share this:
కర్ణాటకలో ఐఏఎస్ అధికారి బీఎం విజయ శంకర్ ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సంచలన సృష్టించిన ఐఎంఎ ఆర్థిక కుంభకోణంలో విజయ శంకర్ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2019లో ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ ఆయనను అరెస్ట్ చేసింది. కొంతకాలం ఆయన జైలు శిక్షను కూడా అనుభవించారు. అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసును సీబీఐకు అప్పగించింది. జైలుకు వెళ్లొచ్చిన తరువాత విజయ శంకర్ మానసికంగా కుంగిపోయారని పలువురు చెబుతున్నారు.

తొలుత కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఉన్న విజయ శంకర్... ఆ తరువాత ఐఏఎస్ అధికారిగా పదోన్నతి పొందారు. ఐఎంఎ స్కాం వెలుగు చూసిన సమయంలో విజయ శంకర్ బెంగళూరు అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నారు. విజయ శంకర్ ఆత్మహత్య సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు... ఆయన నివాసానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

First published: June 23, 2020, 9:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading