భార్య ల్యాబ్ టెక్నీషియన్.. భర్తకు బ్యాంకులో ఉద్యోగం.. కానీ ఆ గొడవలు ఎంత పనిచేశాయంటే..

హత్యకు గురైన మంజుల

మంజుల తాలుకా ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. మరోవైపు మంజునాథ్.. నగరంలోని కెనరా బ్యాంకులో పనిచేస్తున్నాడు.

 • Share this:
  ఓ మహిళ ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. అయితే ఆమె భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఈ క్రమంలోనే భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఇలా మహిళతో గొడవపడ్డ ఆమె భర్త.. అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని కుష్టగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసకుంది. వివరాలు.. యలబుర్గి తాలూకా యడ్డోణి గ్రామానికి చెందిన మంజులకు కొప్పళ తాలూకా ముద్దాబళ్లికి చెందిన మంజునాథ్‌ కట్టమని కొంతకాలం క్రితం వివాహం జరిగింది. మంజుల తాలుకా ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం కోవిడ్ వార్డులో సేవలు అందిస్తోంది. మరోవైపు మంజునాథ్.. నగరంలోని కెనరా బ్యాంకులో పనిచేస్తున్నాడు.

  అయితే మంజునాథ్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలోనే మంజునాథ్, మంజులల మధ్య గొడవలు జరిగేవి. ఇక, గురువారం మంజునాథ్, మంజుల దంపతులు బృందావన హోటల్‌కు వెళ్లి భోజనం చేశారు. ఇద్దరు కలిసి భోజనం చేస్తున్న ఫొటోను స్టేటస్‌గా పెట్టుకుంది. ఆ తర్వాత ఏదో విషయంలో దంపతుల మధ్య గొడవ ప్రారంభం అయింది. ఇది చివరకు పెద్ద వాగ్వాదానికి దారితీసింది.

  ఈ క్రమంలోనే తీవ్ర ఆవేశానికి లోనైన మంజునాథ్.. మంజులపై దాడి చేశాడు. మొబైల్ చార్జర్ వైర్‌ను ఆమె మెడకు బిగించి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె ముఖాన్ని రాళ్లతో చెక్కాడు. ముఖాన్ని ఎవరు గుర్తుపట్టకుండా చేసి.. కొప్పళ రోడ్డు కదళినగర వద్ద పొలంలో పడేసి పారిపోయాడు. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకుని.. పరిసరాలను పరిశీలించారు. ఆ మృతదేహం మంజులదిగా గుర్తించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
  Published by:Sumanth Kanukula
  First published: