సమాజంలో కొందరు మనుషుల మీద, మూగ జీవాల విపరీతమైన ప్రేమను కల్గి ఉంటారు. తమ ప్రాణంకన్న వారినే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు. ఒక వేళ వారు దూరమైతే భరించలేరు. ఈ క్రమంలో కొందరు వారి వస్తువులను, బట్టలను గుర్తులుగా ఉంచుకుంటారు. మరికొందరు వెరైటీగా ప్రవర్తిస్తారు. చనిపోయిన వారి మృత దేహలను ఫ్రీజ్ లో దాచిపెడుతుంటారు. ఇంకొందరు చనిపోయిన తమకు ఇష్టమైన వారిని ఇంట్లోనే పూడ్చిపెడుతుంటారు. తమ వారు చనిపోయిన విషయాన్ని సైతం బయటకు తెలియనివ్వరు. కొన్ని సందర్భాలలో చనిపోయిన వారి శరీరాల నుంచి దుర్వాసన వస్తుంది. దీంతో ఇలాంటి ఘటనలు వెలుగులోనికి వస్తాయి. అచ్చం ఇలాంటి సంఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. కర్ణాటకలో (Karnataka) ఒక కన్నతల్లి వింతగా ప్రవర్తించింది. మాండ్యజిల్లాలోని హాలహళ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. కాగా, నాగమ్మ (nagamma) అనే మహిళ తన కూతురు రూపతో కలసి స్థానికంగా ఉన్న ఇంట్లో ఉంటుంది. అయితే, కొన్ని రోజులుగా నాగమ్మ ఇంటి నుంచి బయటకు రావడం మానేసింది. ఆమె ఇంటి నుంచి భరించలేని దుర్వాసన బైటకు వస్తుంది. స్థానికులు మొదట ఆమె ఇంటిలో ఏదైన ఎలుక, పందికొక్కు చనిపోయిందేమో అనుకున్నారు.
ఆమె వాలకం మీద చుట్టుపక్కల వారికి అనుమానం కల్గింది. దీంతో స్థానికులు ఆమె ఇంటి తలుపులు పగలగొట్టి చూశారు. వెంటనే షాక్ కు గురయ్యారు. మంచం మీద రూప మృత దేహం (daughters dead body) కుళ్లిపోయిన స్థితిలో ఉంది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృత దేహాన్ని మార్చురీకి తరలించారు. శవాన్ని చూసిన డాక్టర్లు మహిళ చనిపోయి నాలుగు రోజులు దాటి ఉండవచ్చని అన్నారు. కాగా, రూప భర్త నుంచి కొన్నేళ్లకు ముందు విడిపోయింది. అప్పటి నుంచి తల్లి (Mother) నాగమ్మ వద్దనే ఉంటుంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. (Karnataka horror) ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.