హోమ్ /వార్తలు /క్రైమ్ /

ప్రియుడితో చివరి ఫోన్ కాల్.. నా చావుకి కారణం మా అమ్మ నాన్న.. కూతురిని అత్యంత కిరాతకంగా..

ప్రియుడితో చివరి ఫోన్ కాల్.. నా చావుకి కారణం మా అమ్మ నాన్న.. కూతురిని అత్యంత కిరాతకంగా..

 షాలిని (ఫైల్)

షాలిని (ఫైల్)

Karnataka: యువతి, యువకుడు మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఒకరికి వదలి మరోకరు ఉండేవారు కాదు. కానీ వీరి ప్రేమను అమ్మాయి ఇంట్లో వారు ఒప్పుకోలేదు.

కర్ణాటకలో (Karnataka)  మరో పరువు (Caste murder) హత్య ఘటన కలకలంగా మారింది. మైసూరుకు చెందిన యువతి, మరో యువకుడిని ప్రేమించింది. (Love affair) అతను దళిత వర్గానికి చెందిన వాడు కావడంతో వీరిప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరు రహస్యంగా కలుసుకునేవారు. యువకుడిపై, అమ్మాయి తల్లిదండ్రులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిని చంపేందుకు సుపారీ (Dalit murder) కూడా ఇచ్చారు. కొన్ని రోజులకు అమ్మాయి తన ప్రియుడితో ఫోన్ లో మాట్లాడింది. తనకు ఏమైన జరిగితే దానికి కారణం మా అమ్మా, నాన్న, బంధువులే అని ఆమె ఫోన్ లే చెప్పింది. ఈ వాయిస్ రికార్డును పోలీసులకు ఇవ్వాలని కోరింది. ఈక్రమంలో.. బాలికను కన్నతండ్రి అతి కిరాతకంగా హతమార్చాడు. ప్రస్తుతం ఈ ఘటన కన్నడ నాట తీవ్ర కలకలంగా మారింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలో (karnataka) పరువు హత్య వార్తలలో నిలిచింది. మైసూర్ జిల్లాలోని పెరియపట్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దళిత యువకుడిని ప్రేమిస్తున్నాడన్న కారణంతో కగ్గుండి గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి తన 17 ఏళ్ల కుమార్తె షాలిని సోమవారం హత్య చేశాడు. కాగా,వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన షాలిని, మేళ్లహల్లి గ్రామంలో ఉండే మంజునాథ్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో బాలికను పద్ధతి మార్చుకొవాలని పలుమార్లు ఇంట్లో వారు హెచ్చరించారు. అయిన కూడా ఆమె అతడినే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టింది.

దీంతో ఒక రోజు యువతి, ప్రియుడికి ఫోన్ చేసి (Phone call) తనను బలవంతంగా ఎదో చేయాలని కుట్ర చేస్తున్నారని అబ్బాయికి చెప్పుకొని బాధపడింది. "నా కిడ్నాప్, హత్య జరిగితే, ఈ ఆడియో క్లిప్‌ను పెరియపట్న పరిధిలోని పోలీసులకు ,డిజి , ఐజిపికి ఇవ్వండి. ఏదైనా జరిగితే, నా తల్లిదండ్రులు,బంధువులు బాధ్యత వహించాలి" అని ఆమె చెప్పింది.ఆ తర్వాత యువతిని ఆమె తండ్రి అతి కిరాతంగా హత్యచేశాడు.ఈ క్రమంలో.. కూతురిని హత్య చేసిన తర్వాత సురేష్ గురువారం పోలీస్ స్టేషన్‌కు వచ్చి నేరం అంగీకరించాడు. నిందితుడు తన కుమార్తెను గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి తల్లిని, ఆమె బంధువులను అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. మరో వైపు దళిత బాలుడు మంజునాథ్ అనే దళిత బాలుడు, బాలిక తల్లిదండ్రులు  హత్య చేసేందుకు రూ. 2 లక్షల ‘సుపారీ’ (కాంట్రాక్ట్) ఇచ్చారని, తనపై పోలీస్ స్టేషన్‌లో మూడు తప్పుడు ఫిర్యాదులు చేశారని పోలీసులకు తెలిపాడు. తన ప్రియురాలిని తనకు కాకుండా చేశారని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది.

First published:

Tags: Brutally murder, Crime news, Karnataka, Love affair

ఉత్తమ కథలు