హోమ్ /వార్తలు /క్రైమ్ /

Love Tragedy: లవర్ ను భరించడం నా వల్ల కాదు.. ఆమెపై తగలెట్టిన ఖర్చుల చిట్టా రాసి.. ప్రియుడు ఏం చేశాడంటే..

Love Tragedy: లవర్ ను భరించడం నా వల్ల కాదు.. ఆమెపై తగలెట్టిన ఖర్చుల చిట్టా రాసి.. ప్రియుడు ఏం చేశాడంటే..

చేతన్ (ఫైల్)

చేతన్ (ఫైల్)

Karnataka: యువతిని ఇష్టపడ్డాడు. ఆమె అంగీకారం కోసం తొమ్మిదేళ్ళుగా వేచిచూశాడు. ఆమె సంతోషపడితే అదే చాలను కున్నాడు. కానీ ఆమె ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.

కొంత మంది ప్రేమకున్న గొప్పతనాన్ని దిగజారుస్తున్నారు. అడ్డమైన అవసరాల కోసం ప్రేమను పావుగా ఉపయోగించుకుంటున్నారు. ప్రేమిస్తున్నానని చెప్పి, ఎదుటి వారితో అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి, కావాల్సినవన్ని కొనిపించుకుని తీరా అవసరం తీరాక ముఖం చాటేస్తున్నారు. ఇలాంటి మోసాలు (Love affair) చేయడంలో అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఉంటున్నారు. కొన్ని చోట్ల అమ్మాయిలు, అబ్బాయిలకు హస్కిగా మాట్లాడి, వారిని బుట్టలో వేసుకుంటున్నారు. మరికొన్ని చోట్లలో అబ్బాయిలు కూడా తమ అవసరాల కోసం అమ్మాయిలను వాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా నిజాయితీగా ప్రేమించిన వారు మాత్రం.. తాము ప్రాణంగా ప్రేమించిన వారు.. మోసం చేస్తే తట్టుకోలేరు. ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం జరిగాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం మరోసారి వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలోని లో (Karnataka) ఒక వింత లవ్ స్టోరి విషాదంగా మారింది. చిక్క మంగళూరులో ఈ ఘటన జరిగింది. శంకరపూర్ కు చెందిన చేతన్ అనే వ్యక్తి తొమ్మిదేళ్లుగా ఒక యువతిని ప్రేమించాడు. అతను సరుకును ట్రాన్స్ పోర్టు చేసే వాహనాన్ని నడిపేవాడు. ఈ క్రమంలో తన ప్రియురాలి సరదా కోసం ఏది ఇవ్వడానికైన వెనుకాడేవాడు కాదు. ఆమె కోసం కాస్లీ గిఫ్ట్ లు సైతం కొనిచ్చేవాడు. వీరిద్దరు తరచుగా కలుసుకుంటూ, జాలీగా తిరిగే వారు. అయితే, అతను యువతిని పెళ్ళి చేసుకుందామని కోరాడు. దీంతో యువతి పెళ్లికి (Marriage) నిరాకరించింది.

ఎన్ని సార్లు అడిగిన ఆమె ఒప్పుకోలేదు. దీంతో అతను విసిగిపోయి.. స్నేహితుల దగ్గర తన బాధను చెప్పుకున్నాడు. ఆ తర్వాత.. ప్రియురాలి ప్రవర్తనతో విసిగిపోయి, జీవితం మీద విరక్తితో ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత.. ఇంట్లో వారు గదిలో వెళ్లి చూడగా.. చేతన్ విగత జీవిగా దూలానికి వేలాడుతూ కన్పించాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు తన ప్రియురాలపై 4.50 లక్షలు ఖర్చుచేశానని, అవి వసూల్ చేసి తన కుటుంబానికి ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Karnataka, Love affair

ఉత్తమ కథలు