హోమ్ /వార్తలు /క్రైమ్ /

అమ్మాయి మత్తు మాటల్లో పిచ్చోడయ్యాడు... ఏకంగా 5. 7 కోట్ల సొమ్మును ట్రాన్స్ ఫర్ చేసిన బ్యాంక్ మేనేజర్.. ఎక్కడంటే..

అమ్మాయి మత్తు మాటల్లో పిచ్చోడయ్యాడు... ఏకంగా 5. 7 కోట్ల సొమ్మును ట్రాన్స్ ఫర్ చేసిన బ్యాంక్ మేనేజర్.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Karnataka: డేటింగ్ యాప్ లో అమ్మాయి పరిచయం అయ్యింది. ఆమెతో డైలీ చాట్ చేసేవారు. కొన్ని రోజులకు వీడియో కాల్స్ కూడా మాట్లాడకునేవారు. ఆమె మత్తులో బ్యాంక్ మేనేజర్ చిక్కుకున్నాడు.

కొందరు అమ్మాయిలు.. అబ్బాయిల బలహీనతలను ఆసరాగా చేసుకుంటారు. మత్తైన తమ మాటలతో అవతలి వారిని బుట్టలోవేసుకుంటారు. తమ చుట్టు తిప్పుకుంటారు. తమ పనులకు వాడుకుంటారు. ఆ తర్వాత.. అసలు ట్యాలెంట్ బయట పెడుతుంటారు. మనం తరచుగా కొందరు అమ్మాయిలు హనీట్రాప్ కు పాల్పడుతున్న సంఘటనలు మనం చూస్తునే ఉంటాం.

ఫేస్ బుక్ లోను, డేటింగ్ యాప్ లోను.. యువతులు ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెడుతుంటారు. ఆ తర్వాత.. అవతలి వారిని మాయ మాటలతో ముగ్గులోకి దింపుతారు. తర్వాత.. వీడియో కాల్ అని, న్యూడ్ కాల్ అంటూ.. వారిని టెమ్ట్ చేస్తారు. ఆ తర్వాత.. తమకు కావాల్సిన పనులు చేసుకుంటారు. ఇలాంటి ఘటనలను మనం తరచుగా చూస్తునే ఉంటాం. ఈ కోవకు చెందిన మరోక ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలో ఒక బ్యాంకు మేనెజర్ యువతి హనీ ట్రాప్ వలలో పడ్డాడు. ఇండియన్ బ్యాంక్ లో ఆడిట్ కు వచ్చిన అధికారులు డబ్బులు నిల్వలు తక్కువగా ఉండటంతో ఆరా తీయగా ఘటన వెలుగులోనికి వచ్చింది. బెంగళూరులోని హనుమంతనగర్‌లో ఉన్న ఇండియన్ బ్యాంక్ మేనెజర్ హరిశంకర్, డేటింగ్ యాప్ లో యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త కాల్స్.. వరకు వెళ్లింది. హరిశంకర్ ఆమె బుట్టలో పడిపోయాడు. ఈ క్రమంలో.. తన ప్రియురాలి కోసం కస్టమర్ లు బ్యాంక్ లో పెట్టిన సోమ్మును ఆమె చెప్పిన అకౌంట్ లకు ట్రాన్స్ ఫర్ చేశాడు.

అతగాడు.. ఏకంగా .5.7 కోట్లను యువతి చెప్పిన అకౌంట్ లకు మళ్లించాడు. కాగా, మే 13 నుంచి 19 మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్ లో 28 ఖాతాలకు, కర్ణాటకలోని 2 ఖాతాలకు.. మొత్తం 136 లావాదేవీల్లో డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతే కాకుండా అతని పర్సనల్ డబ్బులు.. 12.5 లక్షలను కూడా ట్రాన్స్ ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు హరిశంకర్ ను అరెస్టు చేశారు. అనేక కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఒక భర్త అనుమానంతో తన భార్యపై హత్యయత్నానికి పాల్పడ్డాడు.

ముంబైలోని (mumbai)  దహిసర్ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. రహత్ (37) అనే వ్యక్తి.. తన భార్య మొబైల్ ఫోన్‌లో ఎక్కువ సమయం గడపడంపై కోపోద్రిక్తుడయ్యాడు. ఆమెకు అప్పటికే అనేక మార్లు చెప్పాడు. కానీ ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో.. భార్య రహత్ పై.. ఇంట్లో కుటుంబ సభ్యుల (brutally attack)  ముందే దాడిచేశాడు. ఆమెను పేపర్ కట్ చేసే బ్లేడుతో దాడిచేశారు.

ముఖం, ఛాతీ , పొత్తి కడుపు, చేతుల మీద నరికాడు. చేతుల మీద దాదాపు.. 30 సార్లు పొడిచాడు. దీంతో లోతైన కత్తిగాట్లు పడ్డాయి. ఆ ప్రాంతమంతా రక్తంతో నిండిపోయింది. ఆ తర్వాత.. అతను పారిపోయాడు. రహత్ రక్తపుమడుగులో కుప్పకూలి పడింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కూతురు మీరా రోడ్డులోని ఆసుపత్రికి తరలించారు. రహత్ కు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ కుటుంబ సభ్యులకు తెలిపారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Banking fraud, Crime news, Karnataka