Home /News /crime /

KARNATAKA 5 PEOPLE WERE KILLED IN A ROAD ACCIDENT IN CHITRADURGA DISTRICT SU

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఐదుగురు మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

    కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. చిత్రదుర్గ జిల్లాలోని మొలకల్మూరు తాలుకాలోని బిలికేరే గ్రామానికి సమీపంలోని రహదారిపై శనివారం రాత్రి ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జనుజ్జు అయింది. ఈ ప్రమాదంలో నలుగురు ఘటన స్థలంలోనే మరణించగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మ‌ృతులను రాయిచూర్ జిల్లాలోని లింగాసుగూర్ తాలుకాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని బల్లారిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

    మరణించిన వారంతా కూలీలుగా తెలుస్తోంది. వారు తమ స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి అతి వేగం, డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు.





    అలాగే పొగమంచు కూడా కారణం అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. అలాగే ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Karnataka, Road Accident

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు