Home /News /crime /

కరీంనగర్‌లో దారుణం... సొంత కుటుంబానికి పాయసంలో విషం ఇచ్చి...

కరీంనగర్‌లో దారుణం... సొంత కుటుంబానికి పాయసంలో విషం ఇచ్చి...

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మన్విత, సిద్ధార్థ

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మన్విత, సిద్ధార్థ

ఉమా అనే మహిళ... భర్త అంజయ్య, మామ రాజేశం, కొడుకు సిద్దార్థ , కూతురు మన్వితకు పాయసంలో విషం కలిపి వడ్డించింది.

    తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు నేరాలు ఎక్కువైపోతున్నాయి. కొంతమంది సొంత కుటుంబాన్నే దారుణంగా హతమార్చేస్తున్నారు. కొందరు క్షణికావేశంతో హత్యలు చేస్తుంటే.. మరికొందరు మానవత్వం మరిచి తన అనుకున్నవాళ్లను పక్క పథకం ప్రకారం చంపేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సొంత కుటుంబాన్ని హతమార్చేందుు ఓ మహిళ పథకం వేసింది. పాయసంలో విషం కలిపి పెట్టి ఉమ అనే మహిళ పరారయ్యింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉమా అనే మహిళ... భర్త అంజయ్య, మామ రాజేశం, కొడుకు సిద్దార్థ , కూతురు మన్వితకు పాయసంలో విషం కలిపి వడ్డించింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన వీరందరిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వీరిలో నాలుగేళ్ల కూతురు మన్విత పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Crime, Crime news, Karimangar, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు