Home /News /crime /

KARIMNAGAR MINOR GIRL GET PREGNANT BUT HER REFUSED TO MARRY HSN

కడుపులో నొప్పిగా ఉందని చెప్పిన బాలిక.. ఆస్పత్రికి తీసుకెళ్తే బయటపడిన షాకింగ్ నిజం..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అతడే తన సర్వస్వమని నమ్మిన ఆ బాలిక పూర్తిగా మాయలో పడిపోయింది. ఫలితంగా కొద్ది నెలలకే గర్భవతి అయింది. మొదట్లో ఈ విషయం గ్రహించలేని ఆమె నిర్లక్ష్యం చేసింది. తీరా ఆమె గర్భవతి అని తెలిశాక అతడిని పెళ్లి చేసుకోమని కోరింది. దీంతో తన అసలు రంగును ఆ యువకుడు బయటపెట్టాడు. పెళ్లి చేసుకోవాలంటూ మూడు లక్షల కట్నం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు.

ఇంకా చదవండి ...
    నువ్వంటే నాకిష్టమంటూ ఆ బాలిక వెంట తిరిగాడు. నువ్వు లేకుంటే నేను బతకలేనని కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. సినిమాలకు, షికార్లకు తిప్పి ఆమెను తన మాయలో పడేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగదీసుకున్నాడు. అతడే తన సర్వస్వమని నమ్మిన ఆ బాలిక పూర్తిగా మాయలో పడిపోయింది. ఫలితంగా కొద్ది నెలలకే గర్భవతి అయింది. మొదట్లో ఈ విషయం గ్రహించలేని ఆమె నిర్లక్ష్యం చేసింది. తీరా ఆమె గర్భవతి అని తెలిశాక అతడిని పెళ్లి చేసుకోమని కోరింది. దీంతో తన అసలు రంగును ఆ యువకుడు బయటపెట్టాడు. పెళ్లి చేసుకోవాలంటూ మూడు లక్షల కట్నం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. తనను పెళ్లి చేసుకుంటే జీవితాంతం నీకు నరకం చూపిస్తానంటూ బెదిరిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

    మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఉపాధి నిమిత్తం కరీంనగర్ కు వెళ్లింది. అక్కడే కూలి పనులు చేసుకుంటోంది. ఆ తల్లిదండ్రులకు తోడుగా వారి కూతురు కూడా ఓ షాపులో పనిచేస్తోంది. ఆమె రోజూ షాప్ కు రావడాన్ని స్థానికంగా ఉండే సమీర్ అనే యువకుడు గమనించాడు. ఆ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెను సినిమాలకు, షికార్లకు తిప్పేవాడు. ఫ్రెండ్ నంటూ వచ్చిన అతడు, కొద్ది కాలానికే ప్రేమ అంటూ మాయమాటలు చెప్పాడు. అతడి నిజస్వరూపం తెలియని ఆ బాలిక, అతడి మాటలను పూర్తిగా నమ్మింది. తనను తాను అర్పించుకుంది. చివరకు గర్భవతి అయింది.

    ఓ రోజు ఆ బాలిక కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పుడే ఆమె గర్భవతి అయిన విషయం బయటపడింది. దీంతో ఆ బాలికను నిలదీస్తే సమీర్ గురించి ఆమె పూర్తి వివరాలు చెప్పింది. దీంతో అతడిని పట్టుకుని నిలదీస్తే మొదట్లో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. తీరా కొద్ది రోజులకే మూడు లక్షలు కట్నం కావాలని డిమాండ్ చేశాడు. గతేడాది నవంబర్ 12న ఆ బాలిక ప్రసవించింది. అప్పటికీ అతడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. ’మూడు లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటా. ఒకవేళ బెదిరించి పెళ్లి చేసుకునేలా చేసినా నీకు జీవితాంతం నరకం చూపిస్తా..‘ అంటూ ఆ బాలికను సమీర్ బెదిరించసాగాడు. దీంతో విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వాళ్లకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. తన కూతురుకు న్యాయం చేయాలంటూ కోరారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ మొదలుపెట్టారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Dowry harassment, Love affair, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు