కరీంనగర్ డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు...ఉచ్చులో చిక్కిన ఉద్యోగులు

కరీంనగర్ లో దాసి రవీందర్‌ నుంచి డ్రగ్‌ కంట్రోల్‌ శా ఖ జూనియర్‌ అసిస్టెంట్‌ వినాయక్‌రెడ్డి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా వలపన్ని అదుపులోకి తీసుకున్నారు.

news18-telugu
Updated: September 8, 2020, 9:18 AM IST
కరీంనగర్ డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు...ఉచ్చులో చిక్కిన ఉద్యోగులు
ఏసీబీ దాడుల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన డ్రగ్ కంట్రోల్ ఉద్యోగులు
  • Share this:
మెడికల్‌ షాపు అనుమతి కోసం లంచం డిమాండ్‌ చేసిన డ్రగ్స్‌ కంట్రోల్‌ డిపార్టుమెంట్‌ జూనియర్‌ అసిస్టెంట్‌, అతని సబార్డినేట్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే కరీంనగర్ చైతన్యపురిలో అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ రెయిడ్స్ లో అవినీతికి పాల్పడిన ఇద్దరు ఉద్యోగులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. హుజురాబాద్ కు చెందిన ఫిర్యాదుదారుడు దాసి రవీందర్ తన ఫార్మసీ దుకాణానికి సంబంధించిన లైసెన్స్ జారీ చేసినందుకు జూనియర్ అసిస్టెంట్ పెద్ది వినాయక్ రెడ్డి, ఆఫీస్ సబార్డినేట్ మొహమ్మద్ రిజ్వాన్ అతన్నీ రూ. 20,000 లంచం డిమాండ్ చేశారని ఫిర్యాదు చేశాడు.

దీంతో ఫిర్యాదు దారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కాగా సోమవారం కరీంనగర్ లోని అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పెద్ది వినాయక్ రెడ్డి,ఆఫీస్ సబార్డినేట్ మొహమ్మద్ రిజ్వాన్ లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్‌లను కరీంనగర్‌లోని SPE & ACB కేసులకు ప్రత్యేక న్యాయమూర్తి ముందు అరెస్టు చేసి హాజరుపరిచారు,
Published by: Krishna Adithya
First published: September 8, 2020, 9:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading