గర్భవతిని చేసి ముఖం చాటేశాడు...పెళ్లి చేయాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి...

ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి నమ్మించాడు. శారీరక సుఖాన్నీ అనుభవించాడు. గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి అంటే ముఖం చాటేశాడో ప్రబుద్ధుడు. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన ఆ వ్యక్తితోనే తన పెళ్లి జరిపించాలని డిమాండ్ చేస్తూ బాధితురాలు ఏం చేసిందంటే..?

news18-telugu
Updated: August 9, 2020, 12:32 PM IST
గర్భవతిని చేసి ముఖం చాటేశాడు...పెళ్లి చేయాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి నమ్మించాడు. శారీరక సుఖం అనుభవించాడు. గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి అంటే ముఖం చాటేశాడో ప్రబుద్ధుడు. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన ఆ వ్యక్తితోనే తన పెళ్లి జరిపించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాకు చెందిన బాధిత యువతి ఆదివారం ఉదయం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగింది. మానకొండూరు మండలం ఖాదర్ గూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖాదర్ గూడెంకు చెందిన సురేష్, చెంజర్ల గ్రామానికి చెందిన యువతి రవళి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో సురేష్‌తో రవళి శారీరక సంబంధంపెట్టుకుంది. కొన్ని రోజుల క్రితం తనను పెళ్లి చేసుకోవాలని రవళి కోరడంతో సురేష్ నిరాకరించాడు.

దీంతో రవళి..సురేష్ స్వగ్రామమైన ఖాదర్ గూడెంకు చేరుకుని వాటర్ ట్యాంక్ పైకెక్కి ఆందోళనకు దిగింది. తనను గర్భవతిని చేసిన సురేష్‌తో పెళ్లి చేయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. లేకుండే వాటర్ ట్యాంక్ పైనుంచి కిందకు దూసి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. దీంతో స్థానికులు ఆమెను నచ్చజెప్పి వాటర్ ట్యాంక్ పైనుంచి కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే సురేష్‌ను పెళ్లికి ఒప్పించేంత వరకు తాను వాటర్ ట్యాంక్‌పై నుంచి దిగబోనంటూ ఆ యువతి భీష్మించి కూర్చొంది.

కాగా ఈ వ్యవహారంలో ఓ ట్విస్ట్ ఉంది. రవళికి ఇప్పటికే ఇద్దరితో వివాహం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మూడో వ్యక్తిగా సురేష్‌తో సంబంధంపెట్టుకోవడంతో గర్భందాల్చినట్లు చెబుతున్నారు. సురేష్‌తో పెళ్లి జరిపించాలంటూ పది రోజుల క్రితం గ్రామ పంచాయితీ ఎదుట ఆ యువతి ఆందోళనకు దిగగా...పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. పెళ్లి చేసుకునేందుకు సురేష్ ఒప్పుకోకపోవడంతో యువతి ఫిర్యాదు మేరకు సురేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు తాను మూడు మాసాల గర్భవతినని, తన గర్భానికి కారణమైన సురేష్‌తో పెళ్లి జరిపించకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆదివారం ఉదయం రవళి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగింది.
Published by: Janardhan V
First published: August 9, 2020, 12:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading