Sri Reddy: శ్రీరెడ్డిపై కేసు...అబ్బా....అడ్డంగా ఇరికించేసిన టాలివుడ్ నటి...

Sri Reddy: శ్రీరెడ్డిపై కేసు...తనపై శ్రీరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని కరాటే కళ్యాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


Updated: February 18, 2020, 8:44 PM IST
Sri Reddy: శ్రీరెడ్డిపై కేసు...అబ్బా....అడ్డంగా ఇరికించేసిన టాలివుడ్ నటి...
శ్రీ రెడ్డి (File)
  • Share this:
Sri Reddy: వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై సినీ నటి కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై శ్రీరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని కరాటే కళ్యాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా లైవ్ లో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కరాటే కల్యాణిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ విచారణ చేసి, నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. 67 ఐటీ యాక్ట్, 506, 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వ్యక్తుల ప్రతిష్టను కించపరిచేలా కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరమని వారిపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీఎస్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉంటే తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రెండేళ్ల క్రితం కరాటే కల్యాణిపై శ్రీరెడ్డి సైతం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను బెదిరించిన కల్యాణిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో శ్రీరెడ్డి అప్పట్లో కోరారు.

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు