మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌పై సినీ నటి కరాటే కల్యాణి తో పాటు పలు హిందు సంఘాలు సైబర్ క్రైమ్ (Cyber Crime) పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఓ పారి అనే ప్రైవేటు ఆల్బమ్ లో హరే రామ, హరే కృష్ణ మంత్రాన్ని ఐటెం సాంగ్ లో చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రంపై అశ్లీల దుస్తులు, నృత్యాలతో పాటను చిత్రీకరించిన దేవి శ్రీ ప్రసాద్ పై (Devi Sri Prasad) చర్యలు తీసుకోవాలని కోరారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన దేవిశ్రీ ప్రసాద్ హిందు సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలిగించాలని...లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కరాటే కల్యాణి హెచ్చరించారు.
గత నెలలో దేవిశ్రీప్రసాద్ తన ఫస్ట్ హిందీ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట లాంటింగ్ ఈవెంట్‌కు బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హాజరై రిలీజ్ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన రణ్వీర్ సింగ్.. దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి సందడి చేశాడు. ఇద్దరూ కలిసి ఆ పాటను పాడటమే కాకుండా.. అభిమానులను ఉర్రూతలూగించారు. ఈ పాట ఫస్ట్ పాన్ ఇండియా పాప్ సాంగ్ కావడం విశేషం.
ఓ పారి అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. రణ్వీర్, దేవి ఇద్దరూ ఓ పారి సిగ్నేచర్ స్టెప్‌తో అలరించారు. ఇది ప్రేక్షకులను అలరించింది. క్యాచీ పదాలతో దేవిశ్రీ ప్రసాద్ తనదైన మార్కు సంగీతంతో అద్భుతంగా ఆలపించాడు. ఓ పారి ట్రాక్ త్వరలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది.
Sita Ramam : అమెరికాలో సీతారామం టీమ్‌తో మీట్ అండ్ గ్రీట్.. 600లకుపైగా పాల్గొన్న ప్రవాసాంధ్రులు..
Avatar 2 Trailer : అవతార్ 2 ట్రైలర్ చూశారా.. విజువల్ వండర్ అంతే..
తాను కొంతకాలంగా సినిమాయేతర హిందీ సంగీత రంగంలోకి ప్రవేశించాలని ఆలోచనలో ఉన్నానని ఈ లాంచింగ్ కార్యక్రమంలో డీఎస్పీ అన్నాడు. ఇలాంటి సమయంలో భూషణ్ కుమార్ కాకుండా ఇంకెవరితో పనిచేయాలని తనకు అనిపించిందని.. అతడితో వర్క్ చేయడం ఆనందంగా ఉందని అని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Devi Sri Prasad