ఉత్తరప్రదేశ్‌లోని(Uttarapradesh) కాన్పూర్ జిల్లాలో ఓ యువతి సెల్ఫీ దిగుతూ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆమె కాన్పూర్ ఐఐటీలో చదువుతోంది. స్నేహితులతో కలిసి గంగా బ్యారేజీ వద్దకు వెళ్లింది. ఆమె అక్కడ సెల్ఫీలు తీసుకుంటోంది. ప్రమాదవశాత్తు అక్కడే కాలు జారి గంగా నదిలో పడిపోయింది. అక్కడే ఉన్న తోటి స్నేహితులు (Friends) ఎంత వెతికినా కనిపించలేదు. కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ఆచూకీ కనిపించలేదు. దీంతో వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల బృందాన్ని రప్పించారు. సుమారు గంటపాటు బాలిక కోసం ఈతగాళ్లు వెతికారు.
కొంత సమయం తర్వాత ఆమె దొరికింది. వెంటనే పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. చనిపోయిన విద్యార్థి సెజల్ జైన్‌గా గుర్తించారు. ఆమె రాజస్థాన్ కు చెందిన వాసిగా నిర్ధారించారు. ఇక ఈ ఘటన తర్వాత పోలీసులు విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమె ఐఐటీ కాన్పూర్ తో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సాయంత్రం 6 గంటల సమయంలో గంగానది వద్ద ఉణ్న బ్యారేజీ వద్దకు తన స్నేహితులతో కలిసి వాకింగ్‌కు వెళ్లినట్లు సెజల్ సోదరుడు తెలిపారు. అక్కడే వాళ్లు సెల్ఫీలు దిగుతూ.. బ్యారేజీలోని డేంజర్ జోన్ వద్దకు వెళ్లారు.
అక్కడ వాళ్తంతా సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. ప్రమాదవశాత్తు ఆమె ఒక్కసారిగా కాలు జారి నేరుగా గంగా నదిలో పడిపోయింది. ఆమెకు ఈత రాకపోవడంతో మునిగిపోయింది. సెజల్ కిందపడటం చూసిన స్నేహితులు మరియు అక్కడే ఉన్న ప్రజలు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సాధ్యం కాలేదు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
ఈ ఘటనకు సంబంధించి వివరాలు కాలేజీ యాజమాన్యానికి తెలవడంతో.. ఐఐటీ మేనేజ్‌మెంట్ బృందం అక్కడికి చేరుకుంది. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని.. గజ ఈతగాళ్లను రప్పించారు. సుమారు గంటపాటు బాలిక కోసం ఈతగాళ్లు వెతికారు. ఆ తర్వాత ఆమెను బయటకు తీశారు. స్నేహితులు ఆమెను హుటాహుడిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
మరో ఘటనలో.. దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. అభం శుభం తెలియని బాలికపై సవతి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని చిరాగ్ ఢిల్లీ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వాళ్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. బాలికను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news