#MeToo: నటి వసుంధర దాస్‌కు లైంగిక వేధింపులు...

సిగ్నల్ ఎందుకు జంప్ చేశావని అడిగినందుకు కన్నడ నటిని బూతులు తిట్టిన క్యాబ్ డ్రైవర్... ఎక్కడెక్కడో తాకుతూ అసభ్య ప్రవర్తన...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 2, 2018, 5:45 PM IST
#MeToo: నటి వసుంధర దాస్‌కు లైంగిక వేధింపులు...
వసుంధర దాస్ (photos: Wikipedia)
  • Share this:
ఓ వైపు ‘మీటూ’ మూమెంట్ దేశాన్ని అతలాకుతలం చేస్తుంటే, మరోవైపు మహిళలపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కన్నడ నటి, సింగర్ వసుంధర దాస్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. అక్టోబర్ 29న బెంగళూరు నగరంలో జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరు సిటీలోని మల్లేశ్వరం, మర్గోస రోడ్‌లో కేఏ05ఏఈ3933 నెంబర్ గల ఓ క్యాబ్ ఎక్కింది వసుంధర దాస్. సిగ్నల్ జంప్ చేసిన క్యాబ్ డ్రైవర్, ఎందుకిలా చేశావని అడిగినందుకు వసుంధర దాస్‌ను బూతులు తిట్టాడు. మార్గమధ్యంలో వసుంధర దాస్‌ను అక్కడక్కడా తాకుతూ లైంగికంగా వేధించడం మొదలెట్టాడు.

అతని చర్యలకు షాక్ అయిన వసుంధర దాస్, తప్పించుకునేందుకు కారు డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించింది. ఆమె చర్యను గమనించిన క్యాబ్ డ్రైవర్ కారును వేగంగా పోనిచ్చాడు. ముందు సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో అతని నుంచి తప్పించుకుని పారిపోయింది వసుంధర దాస్. మల్లేశ్వరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి, క్యాబ్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసింది. పోలీసులు క్యాబ్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.


విశ్వనాయకుడు కమల్‌హాసన్ స్వీయదర్శకత్వంలో రూపొందిన ‘హేరామ్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన వసుంధర దాస్, ‘మాన్‌సూన్ వెడ్డింగ్’, ‘సిటిజన్’, ‘రావణప్రభు’, ‘లంకేశ్ పత్రికే’ వంటి కన్నడ, మలయాళ, ఇంగ్లీష్, తమిళ చిత్రాల్లో నటించింది. గాయనిగా ఎన్నో పాటలను పాడిన వసుంధర దాస్, ‘ఒకేఒక్కడు’ సినిమాలో ‘షకలక బేబీ’, నాగార్జున ’ఆజాద్’, రాజమౌళి ‘సై’ సినిమాల్లో కూడా పాటలు పాడింది.

First published: November 2, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com