Home /News /crime /

KANCHEEPURAM DISTRICT WIFE SURRENDERED IN POLICE STATION 10 DAYS AFTER HUSBAND MURDER SU

కొడుకు, కోడలు కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన పెద్దాయన.. 10 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం..

విమలారాణి

విమలారాణి

తన కొడుకు, కోడలు, మనవడు కనిపించడం లేదని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

    తన కొడుకు, కోడలు, మనవడు కనిపించడం లేదని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి పురోగతి లభించలేదు. అయితే కొద్ది రోజులు ఆ వ్యక్తి కోడలు వచ్చి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. తన భర్తను చంపినట్టుగా అంగీకరించింది. భర్తను చంపిన తర్వాత తన ప్రియుడి సాయం తీసుకున్నట్టుగా వెల్లడించింది. ఈ షాకింగ్ ఘటన.. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. కాంచీపురం జిల్లాలోని సోమంగళం పోలీస్ స్టేషన్ పరిధిలోని అదానంచెరి, తిరుమకల్ నగర్ ప్రాంతంలో తంగవేల్(44) నివాసం ఉంటున్నాడు. అతనికి భర్యా విమలారాణి(37), కొడుకు హరీష్ రాఘవ్(14) ఉన్నారు. అతడు ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అయితే కొద్ది రోజుల కిందట తంగవే‌ల్ సోదరుడు శక్తివేల్.. అతడికి ఫోన్ చేశాడు. అయితే ఫోన్ లిఫ్ట్ చేసిన తంగవేల్ భార్య విమలారాణి.. తన కొడుకు ఆన్‌లైన్ క్లాసులు వింటున్నాడని చెప్పి ఫోన్ కట్ చేసింది. అయితే ఆగస్టు 1వ తేదీన శక్తివేల్.. తన సోదరుడికి ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆగస్టు 2వ తేదీ ఉదయం 9.30 గంటల సమయంలో మరోసారి ఫోన్ చేయగా.. స్విచ్ఛాప్ అని వచ్చింది. దీంతో ఏదో జరిగిందని శక్తివేల్ అనుమానించాడు.

    ఈ క్రమంలోనే తంగవేల్ తండ్రి.. తన కొడుకు, కోడలు విమలారాణి, మనవడు హరీష్ రాఘవ్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇదిలా ఉండగా.. నిన్న రాత్రి 7 గంటల సమయంలో కనిపించకుండా పోయిన తంగవేల్ భార్య విమలారాణి.. పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమైంది. తన కొడుకుతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయింది. గత నెల 28వ తేదీన తన భర్తతో వాగ్వాదని జరిగిందని విమలారాణి పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలోనే మెడపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్టుగా చెప్పింది. ఆ తర్వాత మృతదేహాన్ని బెడ్‌రూమ్‌లో రాత్రి 10 గంటల వరకు ఉంచానని.. ఆ తర్వాత సేలం నుంచి వచ్చిన తన ప్రియుడు రాజాతో కలిసి మృతదేహాన్ని సమీపంలోని సరుసులో పడేశానని చెప్పింది.

    అయితే పోలీసులు అక్కడ గాలింపు చేపట్టగా మృతదేహం లభించలేదు. దీంతో తిరిగి విమలారాణిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే చెంగల్పట్టు జిల్లా సమీపంలో తంగవేల్ మృతదేహం సగం కాలిపోయిన స్థితిలో దొరికినట్టుగా పోలీసులు గుర్తించారు. అనంతరం గతంలో నమోదు చేసిన మిస్సింగ్ కేసును.. పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. విమలారాణిని అరెస్ట్ చేసి.. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విమలారాణి చెప్పిన రాజు అనే వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలింపు చేపట్టారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Tamil nadu, Wife kills husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు