హోమ్ /వార్తలు /క్రైమ్ /

Kamareddy: కామారెడ్డిలో వివాహిత గొంతు కోసిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. అసలు నిజాన్ని బయటపెట్టిన పోలీసులు..

Kamareddy: కామారెడ్డిలో వివాహిత గొంతు కోసిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. అసలు నిజాన్ని బయటపెట్టిన పోలీసులు..

కామారెడ్డిలో వివాహిత గొంతు కోసిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్..

కామారెడ్డిలో వివాహిత గొంతు కోసిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్..

తెలంగాణలో కామారెడ్డి(Kamareddy) మున్సిపాలిటీలోని బర్కత్‌పురా ప్రాంతంలో మంగళవారం ఉదయం ఓ వివాహిత‌పై హత్యయత్నం ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి.. ఆమె గొంతు కోసం పారిపోయినట్టుగా ప్రచారం జరిగింది.

తెలంగాణలో కామారెడ్డి(Kamareddy) మున్సిపాలిటీలోని బర్కత్‌పురా ప్రాంతంలో మంగళవారం ఉదయం ఓ వివాహిత‌పై హత్యయత్నం ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి.. ఆమె గొంతు కోసం పారిపోయినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్(Shocking Twist) చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోసం పారిపోయాడని వివాహిత.. అందరిని నమ్మించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ కేసులో అసలు నిజాన్ని పోలీసులు వెలికితీశారు. ఆమెపై ఎవరూ దాడి చేయలేదని పోలీసులు గుర్తించారు. తనకు తానే గొంతు కోసుకుని ఆత్మహత్య యత్నం(Suicide Attempt) చేసిందని.. కానీ దానిని హత్యాయత్నంగా చిత్రీకరించాలని చూసిందని పోలీసులు తెలిపారు. ఆమె తనకు తానే గొంతుకోసుకన్న విషయాన్ని పోలీసులు నిర్ధారించారు.

ఇక, బాధిత మహిళకు 9 నెలల క్రితం కామారెడ్డికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. ఆమె భర్త కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆమెకు గతంలో ఉన్న ప్రేమ వ్యవహారం కారణంగానే ఇలా చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం కూడా ఆమె ఆత్మహత్య యత్నం చేసినట్టుగా తెలుస్తోంది. తాజాగా మ‌రోసారి బ్లేడుతో గొంతు కోసుకుని హ‌త్యాయ‌త్నంగా చిత్రీక‌రించింది.

Telangana: పెళ్లైన రెండో రోజే మృత్యు ఒడికి చేరిన నవ వధువు.. మృతదేహాన్ని మోసిన ఎమ్మెల్యే..


ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇక, వివాహిత తనకు తానే గొంతు కోసిన హత్యయత్నం చేసినట్టుగా నమ్మించే ప్రయత్నం చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

బెంగళూరులో పనిచేస్తున్న ఆంధ్ర యువతి.. ప్రతి రోజులాగే ఉద్యోగానికి బయలుదేరింది.. కానీ ఇంతలోనే..

ఇక, మంగళవారం ఉదయం వివాహిత.. కొందరు వ్యక్తులు తన గొంతు కోసి పారిపోయినట్టుగా కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్రంగా గాయపడిన ఆమెను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

తీజ్ సంబరాల్లో విషాదం..

ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలంలోని ఆశేపల్లిలో జరిగిన తీజ్‌ వేడుకల్లో విషాదం చోటుచేసకుంది. ఆశేపల్లి గ్రామానికి చెందిన జాదవ్‌ మెఘాజీ(30) శనివారం రాత్రి కుటుంబ సభ్యులు తీజ్‌ సంబరాల్లో జరుపుకున్నారు. అయితే వేడుకలు జరుగుతున్న సమయంలోనే అతడు పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మెఘాజీ మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మద్యం మత్తులోనే జాదవ్ పురుగుల మందు తాగి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు, నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

First published:

Tags: Crime news, Kamareddy, Suicide attempt

ఉత్తమ కథలు