కామారెడ్డి జిల్లాలో భర్తను చెరో వైపు దంచికొట్టిన ఇద్దరు భార్యలు..

ప్రతీకాత్మక చిత్రం

భర్త ఎటు వెళ్తున్నాడో తెలుసుకునేందుకు మొదటి భార్య ప్లాన్ చేసింది. అయితే, అతడు ఇంటి నుంచి బయలుదేరి.. చక్కగా కామారెడ్డిజిల్లాలో కాపురం పెట్టిన రెండో భార్య దగ్గరకు వెళ్లాడు. దీంతో మొదటి భార్యకు విషయం అర్థమైంది.

 • Share this:
  పెళ్లయి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా తనకు పెళ్లికాలేదని, బ్రహ్మచారినని చెప్పి ఓ వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే, భర్త ప్రవర్తన మీద అనుమానం వచ్చిన మొదటి భార్య అతడిని రెండో భార్యతో ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకుంది. దీంతో షాక్ అవ్వడం రెండో భార్య వంతు అయింది. తమను మోసం చేశాడంటూ ఇద్దరూ కలసి భర్తను చెరోవైపు దంచి కొట్టారు. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వేముల ప్రకాశం అనే వ్యక్తికి బోర్ వెల్ వాహనాలు ఉన్నాయి. బోర్ వెల్ పనుల మీద వెళ్తున్నానంటూ బయటకు వెళ్లిన భర్త... రెండు మూడు రోజుల వరకు ఇంటికి రావడం మానేశాడు. మొదట్లో పనులు ఉంటాయిలే అనుకుంది మొదటి భార్య. కానీ, అది వరుసగా వారం రోజులకు పెరిగింది. మెల్ల మెల్లగా అసలు ఇంటికి రావడంమానేశాడు. ఏకంగా మూడు నెలల పాటు కనీసం ఇంటి ముఖం చూడకపోవడంతో భర్త మీద మొదటి భార్యకు అనుమానం వచ్చింది. ఏదో తేడా జరుగుతోందని అనుమానించింది. ఈ క్రమంలో మూడు నెలల తర్వాత ఇంటికి వచ్చిన భర్త మళ్లీ తాను పని మీద వెళ్తున్నానని చెప్పడంతో ఓకే చెప్పింది.

  భర్త ఎటు వెళ్తున్నాడో తెలుసుకునేందుకు మొదటి భార్య ప్లాన్ చేసింది. అయితే, అతడు ఇంటి నుంచి బయలుదేరి.. చక్కగా కామారెడ్డిజిల్లాలో కాపురం పెట్టిన రెండో భార్య దగ్గరకు వెళ్లాడు. దీంతో మొదటి భార్యకు విషయం అర్థమైంది. తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భావించింది. చుట్టాలు అందరినీ తీసుకుని వెళ్లి తన భర్త రెండో భార్య ఇంట్లో ఉండగా హఠాత్తుగా ప్రత్యక్షం అయింది. మొదటి భార్య సడన్‌గా రావడంతో పరశురాం షాక్ తిన్నాడు. అయితే, తన భర్తే కావాల్సి వచ్చాడా అంటూ ఆమె రెండో భార్య మీద దాడి చేయబోంది. కానీ, అక్కడ అసలు విషయం తెలిసింది.

  రెండో భార్య మరో షాకింగ్ విషయం చెప్పింది. పరశురాం అసలు పెళ్లి కాలేదని చెప్పాడని, అందుకే తాను పెళ్లి చేసుకున్నానని, అసలు పెళ్లయిన విషయం, ఇద్దరు పిల్లలు ఉన్న విషయం ఇప్పుడే తెలిసిందంటూ రెండో భార్య ఘొల్లుమంది. నన్ను కూడా మోసం చేశాడంటూ అసలు విషయం బయటపెట్టింది. దీంతో ఇద్దరు భార్యలు కలసి తమను మోసం చేసిన భర్తను చావగొట్టారు. ఈ వ్యవహారం గురించి తెలిసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆ ఇద్దరు భార్యలు అతడి మీద ఆగ్రహం తట్టుకోలేక తిడుతూ కొడుతూ ఉన్నారు. చాలా సేపటి వరకు నచ్చజెప్పిన పోలీసులు వారు ఎంతకూ వినకపోవడంతో అందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: