ఒడిశాలోని కందమాల్ జిల్లాలో పోలీసుకు మావోలు షాక్ ఇచ్చారు. మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో కూంబింగ్ కు వెళ్లిన పోలీసుపై అకస్మాత్తుగా మెరుపు దాడికి దిగారు మావోయిస్టులు. పోలీసులకు-మావోయిస్టులకు మధ్య సుదీర్ఘంగా ఎదురుకాల్పులు జరిగాయి. కందమాల్ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు తారసపడిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. అప్పటికే పోలీసులు వస్తున్నారనే సమాచంతో అక్కడ మాటు వేసిన మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఊహించని ఘటనతో షాక్ తిన్న పోలీసులు వెంటనే అప్రమత్తమైన ఎదురుకాల్పులు జరిపారు. అయితే మావోయిస్టులు ఎవరైనా గాయపడ్డారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.. వారిని వెంటనే భువనేశ్వర్ లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో డిజిపి అభయ్ తన మల్కన్‌గిరి పర్యటనను రద్దు చేసుకున్నారు.
గాయపడిన కమాండోలను ఇప్పటికే భువనేశ్వరకు తరలించారు. వారి పరిస్థితిని తెలుసుకునేందుకు డిజీడీ అభయ్ మల్కన్ గిరి పర్యటన రద్దు చేసుకుని అక్కడుకు వెళ్లారు. ఆయనతో పాటు ఒక వైద్యుడు కూడా ఉన్నారు. అయితే ఒక IAF హెలికాప్టర్ కూడా పంపమని పోలీసులు కోరారు. కానీ మధ్యలో వాతావరణం సరిగ్గా లేకపోవడంతో అక్కడకు హెలీప్యాడ్ చేరుకోలేకపోయింది. ప్రస్తుతానికి గాయ పడ్డ ఇద్దరి కమాండోల పరిస్థితి స్థిరంగానే ఉంది.
ఇంకా మావోయిస్టులు అక్కడ నుంచి ఎక్కువ దూరం వెళ్లే అవకాశం లేకపోవడంతో.. మరోసారి పోలీసులు కూంబింగ్ వెళ్లారు. ప్రస్తుతం కందమాల్ లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇటీవల విశాఖ జిల్లాలో మావోయిస్టుల హతమయ్యారనే పగతో ఉన్నారు. అందుకే ఇలా పోలీసులపై ఎదురు దాడికి దిగారు మావోలు అని అనుమానిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Maoist attack, Maoist fire, Maoists, Odisha